Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమరావతిపై హైకోర్టు ఉత్తర్వులపై పాక్షికంగా స్టే విధించిన సుప్రీంకోర్టు!

అమరావతిపై హైకోర్టు ఉత్తర్వులపై పాక్షికంగా స్టే విధించిన సుప్రీంకోర్టు!

  • అమరావతిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
  • హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీం నిరాకరణ
  • కాలపరిమితి అంశంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
  • తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా

అమరావతిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, నెల రోజుల్లో కొన్ని పనులు, మరో 6 నెలల్లో ఇంకొన్ని పనులు చేయాలన్న కాలపరిమితులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి వాయిదా వేసింది. అమరావతి వ్యవహారానికి సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. జనవరి 31 లోపు తప్పనిసరిగా జవాబు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

అమరావతి అంశంలో వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా, తీర్పులో మరికొన్ని అంశాలు చేర్చాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం, రైతుల తరఫున అత్యున్నత న్యాయస్థానంలో దాదాపు గంటన్నర పాటు వాదనలు కొనసాగాయి.

Related posts

పెగాసస్ స్కామ్.. బెంగాల్ ప్రభుత్వ విచారణ కమిషన్ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ!

Drukpadam

ఏపీలో టీడీపీ గెలుస్తోందంటూ ‘టైమ్స్ నౌ’ చెప్పడం నిజం కాదా?

Ram Narayana

కేసీఆర్.. కమ్యూనిస్ట్ నేతలతో భేటీపై సంజయ్ రియాక్షన్…

Drukpadam

Leave a Comment