Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైయస్సార్ కుటుంబంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

వైఎస్ కుటుంబం తెలంగాణలో అనేక కబ్జాలకు పాల్పడింది: జగ్గారెడ్డి

  • తన వద్ద ఆధారాలు ఉన్నాయన్న కాంగ్రెస్ నేత
  • ఓపెన్ డిబేట్ కు అయినా సిద్ధమని వెల్లడి
  • అందరి చరిత్రలు బయటపెడతానన్న జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, ఏపీ సీఎం జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది తెలంగాణలో భూకబ్జాలకు పాల్పడ్డారని వెల్లడించారు. మాదాపూర్ తో పాటు, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వీరు కబ్జాలకు పాల్పడ్డారని వివరించారు.

ఇప్పటికీ ఉన్న ఆ కబ్జాలపై ఆధారాలు కూడా చూపిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. ఇందులో ఎలాంటి సందేహం అవసరంలేదని, కావాల్సి వస్తే తాను ఓపెన్ డిబేట్ కు అయినా సిద్ధమేనని స్పష్టం చేశారు. అందరి చరిత్రను బయటపెడతానని అన్నారు.

అందరూ అవినీతిపరులు… ఆమె ఒక్కటే నీతిపరురాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారని షర్మిలపై విమర్శలు చేశారు. షర్మిలకు సరైన చరిత్ర లేదని, ఆమె ఇతర నాయకుల చరిత్రల గురించి మాట్లాడడం ఏంటని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డికి తెలిసి చేశారో, తెలికుండా చేశారో కానీ, ఈ కబ్జాల పర్వంలో షర్మిల, బ్రదర్ అనిల్, జగన్ తదితరులు ఉన్నారని వివరించారు.

Related posts

హర్యానా రైతులపై విరిగిన లాఠీ…

Drukpadam

కేసీఆర్ మీడియా సమావేశంపై బండి సంజయ్ ఆగ్రహం …

Drukpadam

బీజేపీ అడ్డదిడ్డ పాలనకు వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యం కావాలి …కేసీఆర్ ,కేజ్రీవాల్ పిలుపు ..

Drukpadam

Leave a Comment