Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష విధించిన హైకోర్టు!

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష విధించిన హైకోర్టు!

  • కోర్టు ధిక్కరణ కేసులో నెల రోజుల జైలు శిక్ష
  • రూ.2 వేల జరిమానా విధింపు 
  • ధర్మారెడ్డి ఈ నెల 27 లోపు లొంగిపోవాలన్న హైకోర్టు
కోర్టు ధిక్కరణ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి రాష్ట్ర హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ నెల 27 లోపు ఆయన జ్యుడిషియరీ రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

టీటీడీలోని ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు గతంలో తమ సర్వీసుల క్రమబద్ధీకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ ముగ్గురి సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోర్టు అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఆ ఆదేశాలను టీటీడీ అమలు చేయడంలేదంటూ ఉద్యోగులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం… ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష, జరిమానా విధించింది.

Related posts

ఏపీ శాసనమండలి సెక్రటరీ జనరల్ గా సూర్యదేవర ప్రసన్నకుమార్ నియామకం…

Ram Narayana

చంద్రబాబు ఇంటి స్థలం కొలవడానికి లంచం.. డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్!

Ram Narayana

లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో అపశృతి …తారకరత్నకు గుండెపోటు!

Drukpadam

Leave a Comment