ఈటల దారెటు … పార్టీ పెడతారా పార్టీలో చేరతారా ?
-అంత్యంత అవమానకరంగా గెంటివేత
-ఉద్యమకారుడికి ఇచ్చిన బహుమతిగా చర్చ
-గతంలోనూ అనేక మంది ఉద్యమకారులను ఇలానే గెంటి వేశారని వ్యాఖ్యానాలు
-వివిధ జిల్లాలలో నిరసనలు …బీసీ సంఘాల దన్ను
ఎన్నికల ముగిశాయి.ఫలితాలు సైతం వచ్చాయి. మున్సిపల్ ఫలితాలు రావాల్సి ఉన్న వాటిగురించి పెద్దగా ఫరక్ లేదు . తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న ఈటల భర్తరఫ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈటలను భర్తరఫ్ చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్స్ చేయడం దాన్ని గవర్నర్ ఆమోదించటం జరిగిపోయాయి. భర్తరఫ్ అయిన మంత్రి ఇప్పుడు మాజీ అయ్యారు . ఇప్పుడు ఆయన క్రాస్ రోడ్ లో ఉన్నారు, ఏ దారి లో వెళ్లనున్నారు. ఆయన దారెటు అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాపితంగా జరుగుతున్న చర్చ . చాలాకాలం నుంచే ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లి కొత్తగా పార్టీ పెడతారని వార్తలు వస్తున్నాయి . నిజంగా ఆయన ఆ ఆలోచన చేశారా ? పార్టీ పెడతారా ? లేక ఏదైనా పార్టీలో చేరతారా ? అనేదానిపై అప్పుడే ఊహాగానాలు బయలుదేరాయి. పార్టీ పెడితే ఆయన వెంట నడిచే వారెందరు. ఏ పార్టీలో చేరితే ఆయనకు తగిన ప్రాధాన్యత లభిస్తుంది అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆయన మాత్రం తన నియోజకవర్గ కార్యకర్తలు , శ్రేయోభిలాషులు , సన్నిహితులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుల్లో ఆయన ఒకరు. కేసీఆర్ తరువాత పేరున్న కొద్దిమంది నేతల్లో ఆయననొకరు. ఈటల అంటే తెలియని వారు లేరు. ఒక విజన్ ఉన్న నేత శషభిషలు లేవు . చెప్పదల్చుకున్నది నిక్కచ్చిగా నిర్మొహమాటంగా చెపుతాడనే పేరుంది. కేసీఆర్ తో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం కొట్లాడిన ఈటల నేడు భూకబ్జా ఆరోపణలతో అవమానకరంగా మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయడాన్ని ఉద్యమకారులు , ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ముసాయి పేట మండలంలోని ఆయన కోళ్లఫారం కోసం 100 ఎకరాల భూమిని కబ్జా చేశారని రైతులు ఫిర్యాదు . దీనిపై హకీంపేట ,అచ్చంపేట గ్రామాలకు చెందిన ఎస్సీ ,ఎస్టీ , బీసీ లకు చెందిన పేద రైతులకు ప్రభుత్వం తమకు ఇచ్చిన అసైన్డ్ భూములను మంత్రి ఈటల రాజేందర్ ఖబ్జా చేశాడని అంటున్నారు . గ్రామానికి చెందిన 8 మంది రైతులు ముఖ్యమంత్రి కి ఒక లేఖ రాశారు.దానికి స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే విచారణ జరపాలని ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ ను స్వయంగా వెళ్లి విచారణ జరిపి నివేదిక వెంటనే అందచేయాలని కోరారు. ఆఘమేఘాల మీద వెళ్లిన అధికారుల బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విచారణ జరిపి ఈటల భూముల్లో 66 ఎకరాలు కబ్జా జరిగిందని తేల్చారు. ఆ రిపోర్ట్ ని సి యస్ కు అదే రోజు ఆనంద జేశారు. దీనిపై కేసీఆర్ తన మంత్రి వర్గంలో ఉన్న మంత్రి భూకబ్జాలకు పాల్పడ్డారని నిర్దారించుకున్న తరువాత భర్తరఫ్ చేయాలనీ రాష్ట్ర గవర్నర్ కు సిఫార్స్ చేశారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి సిఫార్స్ ను గవర్నర్ ఆమోదించాలిసి ఉంటుంది. అదే జరిగింది. మాజీ మంత్రి ఈటల భర్తరఫ్ పై వివిధ జిల్లాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఖమ్మలోని ఆర్ అండ్ బి అతిధి గృహం వద్ద జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వరంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఇది ఉద్యమకారులకు జరిగిన అన్యాయంగా కొందరు అభిప్రాయపడ్డారు. గతంలోనూ కేసీఆర్ ఉద్యమకారులను బయటికి పంపిన చరిత్ర ఉందని అంటున్నారు. దీన్ని ఉద్యమకారుడికి ఇచ్చిన బహుమతిగా పేర్కొంటున్నారు. అనేక మంది మంత్రిలపై ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నప్పటికీ ఒక బలహీన వర్గాలకు చెందిన ఉద్యమకారుడికి బయటకు పంపటంపై ఇది బలహీన వర్గాలకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు . ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఆశక్తిగా మారింది .
previous post