Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మీడియాను ఎవరు అడ్డుకోలేరు – సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మీడియాను ఎవ్వురు అడ్డుకోలేరు సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జరిగే చర్చల నుంచి మీడియాను నియంత్రించలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యా నించింది.

ప్రజాస్వామ్య నాలుగు మూల స్తంభాల్లో మీడియా ఒకటని,కోర్టుల్లో జరిగే విషయాలను ప్రజలతో మీడియా కమ్యూనికేట్ చేయగలదని జస్టిస్ వై.వీ.చంద్రచూడ్,జస్టిస్ షా లతో కూడిన బెంచ్‌లో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కొద్ది రోజుల క్రితం ఎన్నికల ర్యాలీల విషయమై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ ‘‘మీపై హత్యానేరం ఎందుకు మోపకూడదు?’’

అంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రంగా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

అయితే మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం గడప తొక్కింది ఈసీ.

అనంతరం సుప్రీం స్పందిస్తూ ‘‘కోర్టుల్లో ఏం జరిగిందన్న విషయాన్ని మీడియా పూర్తిగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

కోర్టులకు సంబంధించిన అంశాలను ఇది రిపోర్టు చేయజాలదని అనలేం.

మీడియా చాలా శక్తివంతమైంది.

ప్రతి వ్యవస్థను ప్రజలతో అనుసంధానం చేసే సాధనం.

దానిని నియంత్రించలేం’’ అని పేర్కొంది.

పవర్ ఆఫ్ ఆర్టీఐ

Related posts

ధనవంతులకు ఊడిగం చేయడానికి కాదు: నూతన టీటీడీ చైర్మన్ భూమన

Ram Narayana

తడిసి ముద్దైన తెలంగాణ …గోదావరికి వరద ప్రవాహం !

Drukpadam

How To Make Perfect Salad That Good For Your Skin

Drukpadam

Leave a Comment