Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పాలేరు నియోజకవర్గంలో కొత్త ఇంటికి మాజీ మంత్రి తుమ్మల !

పాలేరు నియోజకవర్గంలో కొత్త ఇంటికి మాజీ మంత్రి తుమ్మల !
-ఖమ్మంలోని నివాసంలో పొంగులేటి నూతన సంవత్సర వేడుకలు
-క్యాంపు ఆఫీస్ లోప్రజలకు అందుబాటులో మంత్రి అజయ్
-సత్తుపల్లి క్యాంపు కార్యాలయంలో లో ఎమ్మెల్యే సండ్ర
-హెడ్ క్వార్ట్రర్స్ లో పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు ,ఎమ్మెల్సీలు

2023 వచ్చేసింది…రాజకీయాల్లో కూడా నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు .2023 సంవత్సరం జిల్లాలోనే అనేక మంది రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించనుంది . మాజీ మంత్రి తుమ్మల పాలేరు నియోజకవర్గంలో కొత్త ఇంటిలో నూతన సంవత్సరం సందర్భంగా ఆత్మీయులను ,మిత్రులను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు . ఎవరు ఎక్కడ నుంచి ,ఏపార్టీ నుంచి పోటీ చేయబోతున్నారనే రసవత్తర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరి ఎత్తుల్లో వారు తలమునకలై ఉన్నారు . ఎవరు ఎన్ని చెప్పిన వేదికలు ఏవైనా తమ రాజకీయ భవిష్యత్ కు పదును పెడుతున్నారు .

ప్రధానంగా ఖమ్మం జిల్లా గులాబీ పార్టీలో వర్గపోరు రోజురోజుకు ఎక్కువుతుంది. ఒక్క ఖమ్మం మినహా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కుమ్ములాటలు జరుగుతున్నాయి.పార్టీలో రెండు మూడు ముఠాలు పడి విమర్శలు చేసుకుంటున్నారు . కత్తులు నూరుతున్నారు . జిల్లాలో వర్గతగాదాలపై కేటీఆర్ ,కేసీఆర్ దృష్టికి అనేక సార్లు తీసుకోని పోయినప్పటికీ ఎవరి కంట్రోల్ చేయలేని పరిస్థితి .దానితో నేతల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది .

పాలేరు లో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఉండగా గత ఎన్నికల్లో ఓడిపోయినా తుమ్మల పాలేరుకు పాలేరును నేనే అంటున్నారు . అందుకు నియోజకవర్గంలోనే పాగా వేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసిటీ లో పెద్ద ఇల్లే కట్టించారు. 2023 జనవరి 1 నుంచి అక్కడ నుంచే కార్యక్రమాలు సాగిస్తామని అంటున్నారు . దీనికి భారీగా అభిమానులు వచ్చేలా పధక రచన చేశారు . అయితే ఈ సీటును సిపిఎం కోరుతుంది. పొత్తుల్లో పార్టీలో ఉన్న తలకాయ నొప్పులతో సీపీఎంకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. అప్పడు తుమ్మల , కందాల రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.

 

ఇక వైరా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ ఉన్నారు . గత ఎన్నికల్లో టీఆర్ యస్ అభ్యర్థిగా ఓడిపోయినా బానోత్ మదన్ లాల్ , మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు . మధిర ఎస్సీ నియోజకవర్గంలో టీఆర్ యస్ నుంచి పోటీచేసిన లింగాల కమల్ రాజ్ సీటు తనదే అంటుండగా , బమ్మెర రామ్మూర్తి , డాక్టర్ కోట రాంబాబు ప్రయత్నాల్లో ఉన్నారు .

ఇక సత్తుపల్లిలో వరసగా మూడు సార్లు విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య తిరిగి పోటీచేసి 4 వ సారి విజయం ఆశలు పెట్టుకోగా ,డాక్టర్ మట్టా దయానంద్ , పిడమర్తి రవి లు తమ ప్రయత్నాలు చేస్తున్నారు .

ఇక కొత్తగూడెం నియోజకవర్గానికి వనమా వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈసారి ఆయన టికెట్ కు వచ్చే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతుంది. అయితే అక్కడ సీటు సిపిఐ కి ఇస్తారని ఒక ప్రచారం ఉంది. ఇది జరిగితే అక్కడ సీటు ఆశిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జలగం వెంకట్రావు లకు మొండి చేయి తప్పదు .

 

అశ్వారావు పేట సీటు మెచ్చకు ఇస్తారా లేక కొత్త వారికీ కేటాయిస్తారా అనేది ఉంది.పినపాక నియోజకవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉండగా గత ఎన్నికల్లో పోటీ చేసిన పాయం కూడా సీటిపై గురిపెట్టారు.

ఇల్లందు నుంచి హరిప్రియ ఉండగా ,మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా సీటు కోసం లాబీయింగ్ చేస్తున్నారు . భద్రాచలంలో డాక్టర్ తెల్లం వెంకట్రావు కు ఇస్తారా ? లేక సిపిఎం కు కేటాయిస్తారా ? అనేది తేలాల్సి ఉంది.

సీట్లు ఎవరికీ వస్తాయో ఎవరికి రావో అంతుపట్టకుండా ఉండటంతో నేతలు బలప్రదర్శన చేసేందుకు సిద్దపడుతున్నారు . పాలేరు లో ఎట్టి పరిస్థితుల్లో పోటీచేయాలని భావిస్తున్న మాజీ మంత్రి తుమ్మల పాలేరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీ లో నూతనంగా నిర్మించిన గృహం లో ఆత్మీయ కలియక పేరుతో అనుయాయులను రమ్మని కబురు చేశారు .

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన కార్యాలయం ప్రకటించింది. సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య , వైరాలో రాములు నాయక్ ,ఇల్లందు లో హరిప్రియ , కొత్తగూడెం వనం వనమా వెంకటేశ్వరరావు ,పినపాకలో రేగకాంతరావు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటారు . మాజీ ఎంపీ పొంగులేటి ఖమ్మం లోని తన నివాసంలో ప్రజలను కలుసుకుంటారని వారి కార్యాలయ ప్రతినిధి తెలిపారు .

Related posts

పుంగనూరు పుడింగీ… ఎవడ్రా నువ్వు?: శ్రీకాళహస్తి సభలో చంద్రబాబు ఫైర్

Ram Narayana

ప్రాణాలైనా ఇచ్చేస్తా కానీ బీజేపీతో మళ్లీ చేతులు కలపను: బీహార్ సీఎం నితీశ్ కుమార్!

Drukpadam

త్వరలో టీఆర్ యస్ ద్విదశాబ్ది ఉత్సవాలు…రాష్ట్ర సమావేశంలో నిర్ణయం…

Drukpadam

Leave a Comment