Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఆక్సీజన్ కోసం ఖమ్మం లో గగ్గోలు…చేతులెత్తేస్తున్న ఆస్పత్రులు…

ఆక్సీజన్ కోసం ఖమ్మం లో గగ్గోలు…చేతులెత్తేస్తున్న ఆస్పత్రులు..
-అధికారులు స్పందించాలని ఆందోళన
-విలవిల్లాడుతున్న రోగులు
-ప్రభుత్వం నిర్ణయించిన ఆక్సిజన్ సిలిండర్ ధర రూ 800
– ఆక్సిజన్ సిలిండర్ ధర బ్లాక్ లో రూ 5 వేలు పైమాటే
-విమానాశ్రయాల్లో ,ఓడరేవుల్లో విదేశాల నుంచి వచ్చిన సహాయం రెడ్ టేపిజం వల్ల ఆగిపోతుంది
ఖమ్మంలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతుంది. ఇటీవల ముగిసిన ఎన్నికలు కూడా ఇందుకు కారణమౌతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారిలో కొంత సీరియస్ గా గాలిపీల్చుకోలేని పేషంట్లకు ఆక్సిజన్ కు అత్యంత అవసరం . గతంలో ఆక్సిజన్ అవసరం చాల అరుదుగా ఉండేది .మహమ్మారి కోవిద్ వల్ల సీరియస్ ఉన్న రోగులకు ప్రాణవాయివు కావాల్సిందే . తెలంగాణాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా ఉంది. ఇక్కడ రోజు వందల సంఖ్య లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. చాలామందికి చాల మైల్డ్ గా ఉంది కొన్ని రోజుల తరువాత తగ్గిపోతున్నప్పటికీ మరికొంత మందిలో తీవ్ర రూపం దాల్చుతుంది. గాలిపీల్చుకోవడమే ఇబ్బందిగా ఉన్న రోగులకు ఆక్సిజన్ అందుచాల్సి ఉంది. గత మూడు రోజులుగా ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. డిమాండ్ కు తగ్గ సప్లైయ్ లేకపోవడం ఒక ఎత్తు అయితే కృత్రిమ కొరత టెండవ కారణం . మనకు రావాల్సిన గ్యాస్ తీసుకొని వచ్చే ట్యాంకర్లను రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకోవడం మూడవ కారణంగా ఉంది. జిల్లాలో ప్రభుత్వ హాస్పటల్స్ తో పాటు 30 ప్రవేట్ హాస్పటల్స్ లో కూడా కరోనా రోగులకు వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . దీంతో కేసులు పెరగటంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్ సరఫరా లేదన్న వార్త రోగులను భయాందోళనలకు గురిచేస్తున్నది . అసలే పెండమిక్ ఆపైన ఆక్సిజన్ కొరత రోగుల ఇబ్బందులు , దీన్ని సొమ్ము చేసుకోవాలని చూసే అక్రమ వ్యాపారులు వెరసి ఆక్సిజన్ దొరక్క వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మహమ్మారికి ముందు సిలిండర్ ధర కేవలం 250 రూపాయలు ఉండేది . దాన్ని ప్రభుత్వమే అధికారికంగా 800 రూపాయలకు పెంచింది.కాని దొరకడంలేదు .బ్లాక్ లో సిలిండర్ ధర 5 వేల రూపాయలు పలుకుతుంది. హాస్పటల్స్ లో కూడా ఆక్సిజన్ పెట్టాలంటే పేషంట్ దగ్గరే డబ్బులు వసూల్ చేస్తున్నారు. దీనిపై నియంత్రణ కరువైంది. జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం పరిస్థితి చక్కబడక పోయిన కొంత వరకు ఆక్సిజన్ అందించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం ద్రుష్టి సారించాలి.


దేశంలో సెకండ్ వేవ్ వచ్చిన తరువాత రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులో అత్యధిక కేసులు 4 లక్షల కేసులు వచ్చాయి. 4 వేల మందికి పైగా చనిపోయారు. మంగళవారం రోజు కేసుల సంఖ్య 5 లక్షల 57 వేల 229 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3 వేల 449 మంది చనిపోయారు. కొన్ని రోజులు అత్యధిక కేసులు వచ్చిన తరువాత కొంత తగ్గుముఖం పట్టి నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మంచి పరిణామమే .అయితే ఇప్పటికి అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై దేశరాజధాని ఢిల్లీ కోర్ట్ కేంద్రప్రభుత్వాన్ని చివాట్లు పెట్టింది. ఆక్సిజన్ మందుల కొరత తీర్చేందుకు అమెరికా తో సహా అనేక దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే మదేశానికి వచ్చిన కంటైనర్లు కస్టమ్స్ అధికారుల కొర్రీలతో ఆగిపోయినట్లు తెలుస్తుంది. అధికారులు అలసత్వం వల్ల ప్రజల ప్రాణాలకు కావాల్సిన మందులు , ఆక్సిజన్ ,ఎయిర్పోర్ట్ లలో , ఓడరేవులలో ఆగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. వీటిని సత్వరం క్లియర్ చేయించాల్సిన పాలకులు చేయంచకపోవడం రెడ్ టేపిజం వెరసి ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఆక్సిజన్ సరఫరా పంపిణీలో కేంద్రం సమన్వయం చేయటంలో లోపాలు ఉన్నాయి విమర్శలు వస్తున్నాయి.కోర్టులు సైతం కేంద్ర ప్రభుత్వం చర్యలపై చివాట్లు పెట్టింది .

దేశంలో రోజుకు 7 వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుండగా దాన్ని 9 వేల టన్నులకు పెంచారు. అయినా కొరత ఉందనే ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రాలు మందులు , వ్యాక్సిన్లు , ఆక్సిజన్ కోసం కేంద్రం వైపు చూస్తున్నాయి. ప్రజల నుంచి వత్తిడి పెరుగుతుంది.కావలిసిన వైద్యం అందటంలేదు. వైద్యులు 24 గంటలు డ్యూటీ చేసిన సరిపోవడం లేదు.దీనిపై కేంద్రం తీసుకునే చర్యలపై దేశం మొత్తం దృష్టి సారించింది .ఈ విపత్కర పరిస్థితిలో చేయగలిగినంత సహాయం చేసేందుకు కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి. వారి సహాయంతీసుకొని దీని నుంచి బయట పడేమార్గం ఆలోచించాలి .

Related posts

ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి: డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ డైరెక్టర్!

Drukpadam

మమతా బెనర్జీ ఇంట విషాదం…

Drukpadam

ఎన్నికల ప్రచార వేళ అఖిలేష్ ఇంట కోవిడ్ కలకలం!

Drukpadam

Leave a Comment