రెండు నెలలపాటు కరెంటు బిల్లులకు కేరళ సీఎం రిలీఫ్
రెండు నెలల వరకు కరెంట్ పెండింగు బిల్లుల కలెక్షన్ ఉండదు
బ్యాంకు లోన్ల రికవరీని బంద్ చేయాలని ఆదేశాలు
ప్రజలకు పోలీసులు అన్ని విధాలా సహకరిస్తారు
కరోనా మహమ్మారి అందరి జీవితంపై ప్రభావాన్ని చూపుతోంది. ఎంతోమంది జీవనోపాధిని కూడా కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల వరకు కరెంట్ బిల్లులను వసూలు చేయడం లేదని చెప్పారు. పెండింగ్ బిల్లులు కట్టాలనే ఒత్తిడి కూడా ఉండదని అన్నారు.
ఇదే సమయంలో బ్యాంకులకు కూడా కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రజలు ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను అనుభవిస్తున్నారని… వారి నుంచి లోన్ల రికవరీని బంద్ చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు పోలీసులు అన్ని విధాలా సహకరిస్తారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంపై పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, రాష్ట్రానికి వెయ్యి టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను, 75 లక్షల డోసుల వ్యాక్సిన్లను పంపాలంటూ ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ఇప్పటికిప్పుడే రాష్ట్రానికి 500 టన్నుల ఆక్సిజన్ అవసరమని… రెండో విడతలో మరో 500 టన్నుల ఆక్సిజన్ అందించాలని కోరారు.