Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎల్‌ఐసీలో వారానికి ఐదు రోజులే పనిదినాలు…

ఎల్‌ఐసీలో వారానికి ఐదు రోజులే పనిదినాలు…
శనివారం సెలవుగా ప్రకటన
మే 10 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు
ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనివేళలు
పాలసీదార్లు గమనించాలని సంస్థ విజ్ఞప్తి
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎల్‌ఐసీ కార్యాలయాలు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నట్లు ప్రకటించింది. ప్రతి శనివారం కార్యాలయాలను మూసివేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 15నే నోటిఫై చేసింది. తాజాగా దీన్ని మే 10 నుంచి అమల్లోకి తేనున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఎల్‌ఐసీ కార్యాలయాలు పనిచేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని పాలసీదార్లు గమనించాలని కోరింది. ఇప్పటికే ఐ టి కంపెనీ లు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేస్తున్నాయి. అన్ని సంస్థలలో ఇది సాధ్యం కాకపోయినా కొన్నిటిలో అవకాశాలు ఉన్నాయి. దీనిపై కేంద్రం వివిధ సంస్థల పనిదినాలపై అధ్యనం చేసింది. కొన్ని రాష్ట్రాలు కూడా ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలనే ఆలోచన చేస్తున్నాయి.

Related posts

నియంత్రణ కోల్పోయి భూమిపైకి దూసుకొస్తున్న చైనా రాకెట్.. సర్వత్రా భయం, భయం!

Drukpadam

అక్రమ మైనింగ్ పై కఠినచర్యలు …దిశాకమిటీ సమావేశంలో ఎంపీ నామ..

Drukpadam

పచ్చి మిరప, ఎండు మిరపలో ఏది ఎక్కువ మంచిది?

Ram Narayana

Leave a Comment