Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు-పిట్టల్లా రాలిపోతున్నారు-CPI ML న్యూడెమోక్రసీ

రాష్ట్రంలో కరోనా ఘోరాతిఘోరం… పిట్టల్లా రాలిపోతున్న జనం
-చలనంలేని సర్కార్…అబద్దాలు చెబుతున్నచీఫ్ సెక్రటరీ
-హాస్పటల్స్ లో బెడ్స్ లేవు ,మందులు దొరకవు
-ఆక్సిజన్ కోసం అల్లాడుతున్న రోగులు

-సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయకార్యదర్శి పోటు రంగారావు

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైనదని సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటురంగారావు విమర్శించారు . రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. టెస్టింగ్ ల కోసమే రాత్రే వచ్చి క్యులైన్ కట్టి అక్కడే నిద్రపోతున్నారు. తెల్లవారే మున్సిపల్ వర్కర్స్ లేపేసరికి ఇద్దరు, ముగ్గురు చనిపోయి వుంటున్నారు. ఇది ఎంత హృదయ విదారక దృశ్యం.
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకటం లేదు. ఆక్సిజన్ లేదు, చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ లేక భాదితులను బలవంతంగా పంపించి వేస్తున్నారు. రాత్రి ఒక గ్రామస్తురాలు గాందమ్మ ఆయాసంతో ఖమ్మం వచ్చారు. వారి పిల్లలు 20 హాస్పిటల్స్ తిప్పిన బెడ్దొరకలేదు. వారు తెల్లవారుఝామున నాకు ఫోన్ చేశారు,నేనూ హాస్పిటల్స్ వాకబు చేసాను. ఒక డాక్టర్ కు అనివార్యంగా ఫోన్ చేశాను. ఆయన కోవిడ్ తో వున్నా సహకరించాడు. ప్రభుత్వ వైద్య శాలల్లో ప్రయత్నించాము. అప్పుడే ఇద్దరు చనిపోయారు. వారి శవం తీయకముందే ఈమెను తీసుకెళ్ళి ఆ బెడ్ దగ్గర కూర్చోబెట్టారు, ఆ సిబ్బింది అనివార్యంగా ఆ పని చేయాల్సి వచ్చింది, లేకపోతే అప్పటికే పదుల సంఖ్యలో వెయిట్ చేస్తున్నారు.టాబ్లెట్స్, ఇంజెక్షన్లు, సిబ్బంది, బెడ్స్, డాక్టర్స్ కొరత తీవ్రముగా ఉంది. ఇంత భయానక ప్రరిస్థితులు ఉన్న ప్రభుత్వానికి కనపడటంలేదు. ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేయడంలేదు .పైగా అన్ని ఉన్నాయని ఎక్కడ ఇబ్బందులు లేవని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ చెబుతున్నారు. ఈ మారణ మృదంగం, హహకారాలు సీఎం కెసిఆర్ కి, సీఎస్ సోమేష్ కుమార్ కు వినిపించడంలేదు. వారికి దృష్టి దోషం వచ్చింది. ప్రజల ప్రాణాలను చులకనగా చూస్తున్నారు. ప్రజలకు అబద్ధాలు చెపుతున్నారు. భూములు, ఆర్ధిక ప్రయోజనాలు, అధికారం కోసం ఎన్నికలు, సంతర్పణలు ఇవే వారి కార్యక్రమంగా మారింది. పరిస్థిలులు ఇలాగే ఉంటె ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు .

అసలు ఈ రాష్ట్రములో ప్రభుత్వం వున్నదా, దేశములో గవర్నమెంట్ వుందా? అని ప్రజలకు అనుమానం వస్తున్నది. తక్షణమే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి. తగిన విధముగా బడ్జెట్ కేటయింపులు చేసి మందులు, మెటీరియల్స్ యుద్ద ప్రాతిపదికగా కొనుగోలు చేయాలి. తగిన సి బ్బందిని నియమించాలి.చైన్ కట్టడికి లాక్ డౌన్ కొంతకాలం ప్రకటించాలి.పల్లెలు, పట్టణాలను కబళిస్తున్న కరోనాను అరికట్టాలి. స్కూల్స్, కాలేజెస్ ను కోవిద్ కేంద్రాలుగా గా ఏర్పాటు చేయాలి. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. రెమిడీసివియర్ వంటి ఇంజెక్షన్లు బ్లాక్ దందాను అరికట్టాలి. సీఎస్ సోమేష్ కుమార్ తప్పుదారి పట్టిస్తున్నందుకు బాధ్యతల నుంచి తొలగించాలని తమపార్టీ డిమాండ్ చేస్తున్నదని అన్నారు.

Related posts

జర్నలిస్టులను ఏమీ అనలేదు .. సిరీస్ చూస్తే మీకే అర్థమవుతుంది: హీరో నవదీప్

Drukpadam

ఏపీ రాజకీయాల్లో చిరంజీవి మాటల దుమారం ..!

Ram Narayana

హైదరాబాద్ ‘జూ’ లో నిజాం కాలంనాటి ఆడ ఏనుగు కన్నుమూత!

Drukpadam

Leave a Comment