Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కమలహాసన్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారా?

కమలహాసన్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారా?
  • అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌కు ఘోర పరాభవం
  • త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం
  • తమిళనాడులో జోరుగా చర్చ

మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమలహాసన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఆయనను తీవ్రంగా వేధిస్తోందని, ఈ కారణంగానే ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారని చెబుతున్నారు. అంతేకాదు, త్వరలోనే ఆయనీ నిర్ణయాన్ని వెల్లడిస్తారని కూడా అంటున్నారు. దీనికి తోడు పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారుతుండడం కూడా ఆయన నిర్ణయానికి మరో కారణంగా చెబుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ మహేంద్రన్ సైతం పార్టీని వీడారు. కమల హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీపై ప్రజల్లో ఆసక్తి లేకపోవడం, కార్యకర్తల్లో నైరాశ్యం, ఇప్పట్లో మరే ఎన్నికలు లేకపోవడం వంటివి కూడా కమల్ నిర్ణయానికి కారణమని తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కమల్ తన  పార్టీని మూసేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

Related posts

చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యలు పరిస్కారం …మంత్రులు బొత్స ,బాలినేని!

Drukpadam

కేటీఆర్ వ్యాఖ్యలు శుద్ధ అబద్ధం: కేంద్రమంత్రి జితేంద్రసింగ్!

Drukpadam

రేవంత్ రెడ్డి-జగ్గారెడ్డి ఆత్మీయ కరచాలనం… 20 నిమిషాలకు పైగా భేటీ!

Drukpadam

Leave a Comment