Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తన పార్టీ మార్పు వార్తలు కేసీఆర్ కుట్రలో భాగమే : ఈటల…

తన పార్టీ మార్పు వార్తలు కేసీఆర్ కుట్రలో భాగమే : ఈటల…
-తాను బీజేపీలో కన్వీనెంట్ గా ఉన్నానని వెల్లడి
-కేసీఆర్ వెళ్లగొడితే బీజేపీ తనను అక్కున చేర్చుకుందన్న ఈటల
-తానేదైనా పార్టీని నమ్ముకుంటే చివరి వరకు అందులోనే ఉంటానని స్పష్టీకరణ
-పార్టీ మార్పు వార్తలు కేసీఆర్ దుష్ప్రచారమని ఆరోపణ
-చిల్లర రాజకీయాలకు కేసీఆర్ కేరాఫ్ అడ్రెస్స్ అని విమర్శ
-బీజేపీని అధికారంలోకి తీసుకోని రావడమే తనలక్ష్యమన్న ఈటల

తాను పార్టీ మారబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తాను ఏదైనా పార్టీని నమ్ముకుంటే చివరి వరకు అందులోనే కొనసాగుతానని అన్నారు. కేసీఆర్ తనను వెళ్లగొడితే బీజేపీ తనను అక్కున చేర్చుకుని సముచిత స్థానం కల్పించిందన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం కేసీఆర్ చేయిస్తున్నదేనని ఆరోపించారు.

ఇతర పార్టీల్లో చిచ్చుపెట్టి గెలిచేందుకు ఆయనే ఈ చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈటల అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో సోమవారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

Related posts

జోర్డాన్ పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు.. ఇదిగో వీడియో

Drukpadam

తుమ్మల రాజకీయ చాణిక్యం ఫలిస్తుందా …?

Drukpadam

జ‌గ‌న్‌కూ లేఖ రాసిన దీదీ… భేటీ ముగిశాక బ‌య‌టకొచ్చిన ఆహ్వానం!

Drukpadam

Leave a Comment