చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు: కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప
చంద్రబాబుకు మొదట నోటీసులు జారీ చేస్తాం
ఎన్440కే వైరస్ పేరిట విషప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు
చంద్రబాబుపై కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు
దర్యాప్తు ప్రారంభమైందన్న జిల్లా ఎస్పీ
చంద్రబాబుపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూల్ ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.అందులో భాగంగా ముందు ఆయనకు నోటీసులు ఇస్తామని ఆయన నుంచి వచ్చి సమాధానం బట్టి తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.
కరోనా కొత్త వేరియంట్ (ఎన్440కే) పేరిట దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలులో న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప స్పందించారు. ఎన్440కే వైరస్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబుపై ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఈ కేసులో కర్నూలు వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, చంద్రబాబుకు మొదట నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు. చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.