Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణలో 59 శాతం మంత్రులపై తీవ్ర క్రిమినల్ కేసులు..: ఏడీఆర్ రిపోర్ట్

తెలంగాణలో 59 శాతం మంత్రులపై తీవ్ర క్రిమినల్ కేసులు..: ఏడీఆర్ రిపోర్ట్
-17 మంది మంత్రులకు 10 మందిపై తీవ్ర క్రిమినల్ కేసులు
-మొత్తం మీద 13 మంది మంత్రులపై ఏదో విధమైన క్రిమినల్ కేసులు
-మహారాష్ట్రలో ఎక్కువ మంది మంత్రులపై తీవ్ర క్రిమినల్ కేసులు

దేశవ్యాప్తంగా నేర చరిత్ర, నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసింది. దీన్ని పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో 59 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. మొత్తం 17 మంది మంత్రులకు గాను 10 మందిపై కేసులు ఉన్నాయి. మంత్రులపై తీవ్ర క్రిమినల్ కేసుల పరంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

మహారాష్ట్రలో మొత్తం 20 మంది మంత్రులకు గాను 13 మంది (65 శాతం) తీవ్ర క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో 11 మంది మంత్రులు ఉంటే ఏడుగురిపై సీరియస్ క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. మూడో స్థానంలో తెలంగాణ ఉంది. ప్రస్తుత అసెంబ్లీల్లో 558 మంత్రులకు గాను 486 మంది మంత్రులు కోటీశ్వరులుగా ఉన్నారు. వీరిలో 239 మంది తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్టు ప్రకటించారు.

తమిళనాడులో 33 మంది మంత్రులకు గాను 28 మంది (85 శాతం), హిమాచల్ ప్రదేశ్ లో 9 మందికి ఏడుగురు (78 శాతం), తెలంగాణలో 17 మంత్రులకు 13 మంది, మహారాష్ట్రలో 15 మంది మంత్రులు (75 శాతం), పంజాబ్ లో 11 మంది మంత్రులు (73 శాతం), బీహార్ లో 30 మంది మంత్రులకు గాను 21 మంది (70 శాతం) తమ అఫిడవిట్లలో క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు.

సగటున ఒక్కో మంత్రికి రూ.16.63 కోట్ల ఆస్తులు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారి దగ్గర రూ.21.21 కోట్ల చొప్పున ఆస్తులు ఉన్నాయి. కర్ణాటకలో అత్యధికంగా ఒక్కో మంత్రి సగటున రూ.73 కోట్ల చొప్పన ఆస్తులు కలిగి ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక్కో మంత్రి దగ్గర రూ.47.45 కోట్ల చొప్పున ఆస్తులు ఉన్నాయి.

Related posts

అసెంబ్లీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం!

Drukpadam

తెలంగాణ కాంగ్రెస్ లో హనుమంతుడి లొల్లి…

Drukpadam

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాత మధు ప్రమాణం!

Drukpadam

Leave a Comment