పాకిస్థాన్ లో హిందూ యువతి సనా ఘనత…
సీఎస్ఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన సనా రామ్ చంద్
పాక్ హిందూ వర్గంలో మరే మహిళకు దక్కని ఘనత
సనా ఓ వైద్యురాలు
పాక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పై ఆసక్తి
అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్న సనా
పాకిస్తాన్ దేశంలో ఒక హిందూ యువతి ఆ దేశానికి చెందిన సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ ( సి ఎస్ ఎస్ ) పరీక్షలో ఉత్తీర్ణురాలైంది . ఈ ఘనత సాధించిన మొదటి హిందూ మహిళా కావడం తో ఆమె వార్తలలో వ్యక్తిగా నిలిచింది. మన దేశంలో ఐఏఎస్ ఎలాగో, పాకిస్థాన్ లో పీఏఎస్ కూడా అలాంటిదే. పీఏఎస్ అంటే పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇక మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో పాక్ లో సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ (సీఎస్ఎస్) పరీక్ష నిర్వహిస్తారు. ఈ సీఎస్ఎస్ పరీక్షలో ఓ హిందూ యువతి ఉత్తీర్ణురాలై చరిత్ర సృష్టించింది.
ఆమె పేరు సనా రామ్ చంద్. సింధ్ ప్రావిన్స్ లోని షికార్ పూర్ జిల్లాకు చెందిన సనా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఆమె కంటే ముందు హిందూ వర్గం నుంచి మరే మహిళా సీఎస్ఎస్ పరీక్షలో ఉత్తీర్ణత పొందలేదు. సనా ఓ డాక్టర్. పీఏఎస్ పై ఆసక్తితో ఆమె సీఎస్ఎస్ పరీక్ష రాసింది. ఇప్పుడామెను అసిస్టెంట్ కమిషనర్ గా నియమించనున్నారు.