Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

మాల్దీవుల్లో ఓ బార్లో డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ డిష్యుం డిష్యుం! గాలి వార్తే

మాల్దీవుల్లో ఓ బార్లో డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ డిష్యుం డిష్యుం! గాలి వార్తే
కరోనా వ్యాప్తితో మధ్యలోనే నిలిచిన ఐపీఎల్
స్వదేశానికి విమానాల్లేకపోవడంతో మాల్దీవులకు వెళ్లిన ఆసీస్
వార్నర్, స్లేటర్ కొట్టుకున్నారంటూ మీడియాలో కథనాలు
ఖండించిన వార్నర్, స్లేటర్
మాల్దీవుల్లో ఓ బార్లో డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ డిష్యుం డిష్యుం! గాలి వార్తే నని ఇలాంటి పుకార్లు వ్యాప్తి ఎలా జరుగుతుందో తమకు అర్థం కావడం లేదని డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ తీవ్రంగా ఖండించారు. మాల్దీవుల్లో ఉన్న వారు ఒక బార్లో బాగా తగి మద్యం మత్తులో తన్నుకున్నారని వార్త కథనాలు వెలువడ్డాయి. దీనిపై వారు ఘాటుగా స్పందించారు.
కరోనా వ్యాప్తి కారణంగా ఐపీఎల్ అర్ధంతరంగా ఆగిపోవడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు, వ్యాఖ్యాతలుగా పనిచేస్తున్న మాజీ ఆటగాళ్లు మాల్దీవులు చేరుకున్న సంగతి తెలిసిందే. మే 15 వరకు ఆస్ట్రేలియాకు వెళ్లే విమాన సర్వీసులు నిలిపివేసిన నేపథ్యంలో, ఆస్ట్రేలియన్లు మాల్దీవుల్లో వేచి చూస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, మాజీ ఆటగాడు, క్రికెట్ కామెంటేటర్ మైకేల్ స్లేటర్ మాల్దీవుల్లోని ఓ బార్లో బాహాబాహీకి దిగినట్టు కథనాలు వచ్చాయి. మద్యం మత్తులో కలబడ్డారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

అయితే ఈ కథనాలను డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ ఖండించారు. అవన్నీ పుకార్లేనని మైకేల్ స్లేటర్ స్పష్టం చేశాడు. వార్నర్, తాను మంచి స్నేహితులం అని, తమ మధ్య గొడవ జరిగేందుకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశాడు.

అటు వార్నర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక్కడ ఎలాంటి అసాధారణ ఘటన జరగలేదని వెల్లడించాడు. ఇలాంటివన్నీ ఎక్కడ పుట్టుకొస్తాయో అర్థం కావడంలేదని, ప్రత్యక్షంగా చూడకుండా, నిర్దిష్ట ఆధారాలు లేకుండా గాలి వార్తలను కథనాలు మార్చడం తగదని వార్నర్ హితవు పలికాడు.

Related posts

ఐపీల్ ఆటగాళ్ల పై బీసీసీఐ కీలక ప్రకటన … ఇబ్బందులు ఉంటె వెళ్లవచ్చు

Drukpadam

ఎదురులేని రాజస్థాన్ రాయల్స్… ముంబయికు తీవ్ర నిరాశ!

Drukpadam

ఐపీఎల్ జరగాలంటే… బీసీసీఐ ముందున్న ఆప్షన్లు ఇవే!

Drukpadam

Leave a Comment