కరోనా కట్టడికి నడుం బిగించిన పిండిప్రొల్
స్వచ్ఛందంగా లాక్ డౌన్
కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ గ్రామం నడుం బిగించింది. ఖమ్మం -వరంగల్ ప్రదాన రహదారి పై ఉన్న పిండిప్రోలు గ్రామం స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకుంది.నలుగురికి ఆదర్శంగా నిలిచింది. పంచాయతీ తీర్మానాన్ని ఉల్లంఘిస్తే.. జరిమానా విధిస్తామని గ్రామస్థులను హెచ్చరిస్తోంది.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రొల్ లో రోజు రోజుకు పెరుగుతోన్న కొవిడ్ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా గ్రామంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ రాయల నాగేశ్వరరావు, ఎంపిటిసి వులుగుజ్జు వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లారి 8 గంటల వరకు దుకాణాలు బంద్ ఉంటాయన్నారు.
పంచాయతీ తీర్మానాన్ని ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని వారు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి
చేశారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు పసలాది ముత్తయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ చల్లా వెంకటేశ్వర్లు, ఫోటో గ్రాఫర్ల సంఘం జిల్లా నాయకులు రామనబోయిన నాగరాజు, ఆటో మొబైల్ షాపుల సంఘం నాయకులు పప్పుల ప్రభాకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
స్వచ్ఛందంగా 10 రోజుల పాటు మదీనా టి స్టాల్ కు బంద్ ప్రకటించిన యజమాని సలీమ్ .
ఖమ్మం : ప్రస్తుత కరోనా రెండవ దశ సందర్భంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గత మూడు దశాబ్దాలకు పైగా అల్లంటీకు ప్రసిద్ధిగాంచిన మదీనా టీ స్టాల్ను అతి వేగంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ను అదుపు చేసేందుకు , ఎండల తీవ్రత ప్రభావం వలన నగర ప్రజల ఆరోగ్యం , తన దగ్గర పనిచేసే కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదివారం నుండి స్వచ్ఛందంగా 10 రోజుల పాటు టి స్టాల్ కు బంద్ ను ప్రకటించారని యజమాని సలీమ్ ఓ ప్రకటనలో తెలిపారు .