Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం 2 వేల కోట్ల ఒప్పందమా …?

శివసేన పార్టీ పేరు గుర్తు కోసం 2 వేల కోట్ల ఒప్పందమా …?
-ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
-ఎన్నికల కమిషన్ నిర్ణయమే ఓ ఒప్పందమని సంజయ్ రౌత్ ఆరోపణలు
-ఇది 100 శాతం నిజమని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ట్వీట్
-అధికార పక్షంతో సంబంధాలున్న ఓ బిల్డర్ ఈ విషయం చెప్పారని వెల్లడి

శివసేన పార్టీ పేరు గుర్తు కేటాయింపు కోసం 2 కోట్ల ఒప్పందం కుదిరిందని ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు .శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి పార్టీ పేరు గుర్తు రాకూండా ఉండేందుకు పెద్ద ఎత్తున చేతులు మారాయనేది రౌత్ అభియోగం …దాన్ని బలపరిచేలాగానే చీలికవర్గం నేత మహారాష్ట్ర సీఎం ఎకనాథ్ షిండే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. పార్టీ పేరు ,గుర్తు తమకు వచ్చేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తమ వెనక కొండలా నిలబడ్డారని , ఇచ్చినమాట నిలుపుకున్నారని చెప్పడం సందేహాలకు దారితీస్తుంది….

శివసేన పేరు, గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై శివసేన (ఉద్ధవ్ థాక్రే) కీలక నేత సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ కొనుగోలు కోసం 2 వేల కోట్ల డీల్ జరిగిందని ఈ రోజు ఆరోపించారు.

‘‘రూ.2 వేల కోట్ల డీల్ అనేది ప్రాథమిక సంఖ్య. ఇది 100 శాతం నిజం. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే వెల్లడిస్తా’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. అధికార పక్షంతో సంబంధాలు ఉన్న ఓ బిల్డర్ తనతో ఈ విషయం చెప్పారని వెల్లడించారు.

శివసేన పేరును కొనేందుకు రూ.2 వేల కోట్లతో డీల్ అనేది చిన్న విషయం కాదని అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయమే ఓ ఒప్పందమని ఆరోపించారు. సంజయ్ ఆరోపణలపై షిండే వర్గం ఎమ్మెల్యే సదా సర్వాంకర్ కొట్టిపారేశారు. ‘సంజయ్ రౌత్ క్యాషియరా?’ అని ప్రశ్నించారు.

అమిత్ షా నా వెనుక కొండలా నిలబడ్డారు.. ఏక్ నాథ్ షిండే
కేంద్ర మంత్రి అమిత్‌షా తనకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారన్న ఏక్ నాథ్ షిండే
తన వెంటే బలంగా నిలబడ్డారని వెల్లడి
శివసేన పేరు, పార్టీ గుర్తు తమకే ఈసీ కేటాయించిన నేపథ్యంలో వ్యాఖ్యలు

 

ఏక్‌నాథ్ షిండే వర్గానికి శివసేన పేరు, పార్టీ గుర్తు ‘విల్లు-బాణం’ చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తనకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారని, తన వెంటే బలంగా నిలబడ్డారని చెప్పారు.

‘‘షిండేజీ.. మీరు ముందుకు వెళ్లండి.. మీ వెనుకాల మేము కొండలా నిలబడతాం అని అమిత్‌షా నాతో చెప్పారు. ఆయన చెప్పిందే చేశారు. తన మాట నిలుపుకొన్నారు’’ అని ఏక్ నాథ్ షిండ్ అన్నారు.

గత ఏడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే వర్గం అప్పటి మహా వికాశ్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. శివసేనలోని 40 మంది ఎమ్మెల్యేలను, 13 మంది ఎంపీలను షిండే తన వైపు తిప్పుకున్నారు. దీంతో ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. తర్వాత బీజేపీతో పొత్తుపెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని షిండే ఏర్పాటు చేశారు. షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

పార్టీ గుర్తు, పేరు తమకే చెందాలంటూ ఉద్ధవ్, షిండే వర్గాలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించగా.. వాటిని షిండే వర్గానికే ఈసీ కేటాయించింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతు షిండే వర్గానికే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Related posts

పట్టు -బెట్టు

Drukpadam

ఈ ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి పోలవరానికి శాపం: నిమ్మల రామానాయుడు!

Drukpadam

బీజేపీ మిత్రపక్షాల్లోనూ పెగాసస్ పై అసంతృప్తి… దర్యాప్తు కోరుతున్న నితీశ్ కుమార్!

Drukpadam

Leave a Comment