Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణాలో అమిత్ షా ఆపరేషన్ …పొంగులేటి మొగ్గుతారా … ?

తెలంగాణాలో అమిత్ షా ఆపరేషన్ …పొంగులేటి మొగ్గుతారా …?
తగ్గుతారా …?
-జిల్లాల్లో పట్టున్న నేతలు, అసంతృప్త నేతలే టార్గెట్
-వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు
-ఇప్పటికే జాతీయస్థాయి నేతలతో సంప్రదింపులు
-పార్టీలో చేరికల కమిటీ వద్ద పెద్ద నివేదిక
-ఇందులో కొందరు తాజాలు ఉన్నట్లు ప్రచారం

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉంది.అందుకు అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. బీజేపీ గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తుంది. తెలంగాణాలో ఆకర్ష్ పథకంలో భాగంగానే అమిత్ షా తెలంగాణ పర్యటన తేదీ ఖరారు అయింది …వివిధ పార్టీల నుంచి బీజేపీ లో చేరే వారికోసం గాలం వేస్తున్నారు . ఇప్పటికే వారు బలమైన కొంతమంది నేతలపై ఫోకస్ పెట్టారు .

ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,అమిత్ షా ఆపరేషన్ లో బీజేపీలో చేరుతారనే ప్రచారం బలంగా జరుగుతుంది. అయితే ఆయన తన అభిప్రాయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు . తన రాజకీయ నిర్ణయంపై ఆయన ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారా ?బీజేపీలో చేరేందుకు మొగ్గుతారా …? లేక వెనక్కు తగ్గుతారా ? అనే సందేహాలు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు . ఆయన చేరికవల్ల తనకు ఎంత లాభం ఉంటుందో తెలియదు కానీ బీజేపీకి పెద్ద ప్లస్ అవుతుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి . బీజేపీ ప్రభావం పెద్దగా లేని ఖమ్మం జిల్లాలో గట్టి పోటీకి వస్తుంది . కొన్ని సీట్లు గెలిచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు . బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం , ఇక్కడ పొంగులేటి దూకుడు వెరసి బీజేపీకి సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు …

దక్షిణాదిన బలహీనంగా ఉన్న బీజేపీకి తెలంగాణాలో సానుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడుతోంది . వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది . ఇంచార్జిలు ఎవరైనా తెలంగాణ పార్టీ వ్యవరాలను అమిత్ షా చూస్తున్నారు . ఇక్కడ బీజేపీ బలోపేతం కోసం వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారు . అందుకు గాను తెలంగాణాలో వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతల జాబితాను సిద్ధం చేసిన బీజేపీ, దాన్ని అమిత్ షా కు అందజేసిందని అంటున్నారు . ఆయన తెలంగాణాలో ఆపరేషన్ మొదలు పెట్టారు . కొంతమంది ముఖ్యనేతలను బీజేపీలో చేర్చుకున్నారు .మరికొంతమంది నేతలతో నేరుగా టచ్ లోకి వెళ్లిన అమిత్ షా మార్చ్ 12 న రాష్ట్రానికి రానున్నారు . అప్పటిలోగా వివిధ జిల్లాల్లో వివిధ పార్టీల్లో ఉన్న ముఖ్య నేతల వివరాలు బీజేపీ రహస్య దళాలు సేకరిస్తున్నట్లు సమాచారం . ఎంతవరకు నిజమో తెలియదు కానీ అందులో కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఉండవచ్చునని ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో మోహినాబాద్ ఫామ్ హౌస్ సంఘటన నేర్పిన పాఠాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం …

ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత మాజీ బీఆర్ యస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలోకి తీసుకోని రావాలని గట్టి పట్టుదలతో ఉన్న పార్టీ నాయకత్వం అమిత్ షా తో ఆయన భేటీ జరిగేలా ప్లాన్ చేస్తుందని అంటున్నారు . అందుకు ఆయన కూడా అంగీకరించారని బీజేపీ నుంచి సిగ్నల్స్ అందుతున్నా, ఆయన మాత్రం మౌనం వహిస్తున్నారు .

ఆయనకు ఇటు బీజేపీ ,అటు కాంగ్రెస్ నుంచి ఆఫర్లు ఉన్నాయి. ఎందులో చేరాలనేదానిపై స్పష్టతకు రాలేక పోతున్నారు . బీజేపీ లో చేరితే జిల్లాలో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండవనే వాదన కూడా ఉంది . కాంగ్రెస్ లో చేరితే మొత్తం అన్ని స్థానాలను స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన హితులు సన్నిహితులు చెబుతున్నారు . తాను నమ్ముకున్న వాళ్ళను కాపాడుకోవడంతో పాటు తనకు హార్థిక ,ఆర్థిక అండదండలు కావాలంటే ,బీజేపీలో చేరి ఖమ్మం జిల్లాలో తన సత్తా చాటాలనే యోచనలో ఆయన ఉన్నట్లు వినికిడి .అయినా ఆయన ఎటు తేల్చుకోలేక పోతున్నారని సన్నిహితులు అంటున్నారు .

 

Related posts

సీఎం సీటుకే ఎసరు పెట్టిన హరీష్ రావు నీతులు మాట్లాడటమా ? ఈటల సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

Drukpadam

రాష్ట్రపతి పదవి రేసులో లేనని తేల్చేసిన శరద్ పవార్!

Drukpadam

Leave a Comment