Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

సెంట్రల్ విస్టా పై నిన్న ప్రియాంక ,నేడు రాహుల్ ధ్వజం!

Rahul Gandhi blames Modi amid Central Vista
సెంట్రల్ విస్టా పై నిన్న ప్రియాంక ,నేడు రాహుల్ ధ్వజం
దుల్లో శవాలు తేలుతుంటే… మీ దృష్టి మాత్రం సెంట్రల్ విస్టాపైనే ఉంది: మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
  • ఆసుపత్రుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు ఉంటున్నాయి
  • ప్రజల ప్రాణాలకు రక్షణే లేకుండా పోయింది
  • మీరు పెట్టుకున్న రంగుల కళ్లద్దాలను తీసేయండి
మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ ఇష్టా ప్రాజక్టు పై కాంగ్రెస్ నేతలు నిన్న ప్రియాంక నేడు రాహుల్ తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దేశం కరోనా తో అతలాకుతలం అవుతుంటే మీకు కనబడటంలేదా? ఇదెక్కడి పాలనా ప్రజలను కాపాడే తీరు ఇదేనా అంటూ మోడీ పాలనపై ఇరుచుక పడ్డారు. మీ నల్ల కళ్లద్దాలు తీసి చుస్తే అసలైన దృశ్యాలు కనపడతాయని రాహుల్ వ్యంగ్య బాణాలు వదిలారు .

నదుల్లో నీటిపై తేలుతున్న మృతదేహాలు, ఆసుపత్రుల వద్ద క్యూలలో నిలబడుతున్న కరోనా పేషెంట్లు మీకు కనపడటం లేదా? అంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వీటన్నిటినీ పట్టించుకోకుండా… కేవలం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపైనే దృష్టి సారించారని దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనం, సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి బంగళా, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు 3 కిలోమీటర్ల రహదారిని పునరుద్ధరించడం వంటి నిర్మాణాలు ఉన్నాయి.

ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ… నదుల్లో ప్రతి రోజు శవాలు తేలుతున్నాయని, ఆసుపత్రుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు ఉంటున్నాయని, ప్రజల ప్రాణాలకు రక్షణే  లేకుండా పోయిందని మోదీపై విమర్శలు గుప్పించారు. మీరు పెట్టుకున్న రంగుల కళ్లద్దాలను తీసేయాలని… అవి పెట్టుకుంటే మీకు సెంట్రల్ విస్టా మాత్రమే కనిపిస్తుందని దుయ్యబట్టారు.

బీహార్ లోని బక్సర్ వద్ద గంగానదిలో నిన్న డజన్ల కొద్దీ శవాలు నీటిపై తేలాయి. అయితే, ఇవి ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చాయని బీహార్ అధికారులు తెలిపారు. అవన్నీ యూపీకి చెందిన కరోనా పేషెంట్ల మృతదేహాలని… వాటిని దహనం చేయడానికి స్థలం కూడా లేకపోవడంతో, గంగానదిలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు సగం కాలిన శవాలు హమీర్ పూర్ వద్ద యమునా నదిలో నీటిపై తేలాయి. ఈ ఘటనల నేపథ్యంలోనే మోదీని రాహుల్ టార్గెట్ చేశారు

Related posts

కరోనా దెబ్బకి చైనాలో అతిపెద్ద షాపింగ్ మహల్ మూసివేత …

Drukpadam

ఏపీలో పెగాసస్ రగడ… కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ అసెంబ్లీ!

Drukpadam

ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణలో పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయమా?

Drukpadam

Leave a Comment