Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కొంగలపై బెంగ! అవి రాకపోవడంతో చింతపల్లి ఊరంతా చింత…

కొంగలపై బెంగ! అవి రాకపోవడంతో చింతపల్లి ఊరంతా చింత…
-ప్రతిసంవత్సరం జనవరిలో వస్తున్నా సైబేరిన్ కొంగలు
-వచ్చి పరిశీలన జరిపి వెళుతున్న కొంగలు
-అవి ఉండకపోవడానికి కోతులబెడదా ..? చెట్లు తగ్గటమా,,,?
-దీనిపై గ్రామస్తులంతా దిగాలు
-ఆవివస్తే తమ గ్రామంలో పంటలు బాగా పండుతాయని గ్రామస్తుల -అభిప్రాయం..

ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఆ గ్రామం అతిధుల కోసం ఎదురుచూస్తోంది.. ఊరు ఊరంతా ఏకమై కళ్ళల్లో వత్తులు వేసుకొని ఆకాశం వైపు చూస్తున్నారు.. ఇది ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లి గ్రామంలో పరిస్థితి.. ఇప్పుడు ఆ గ్రామస్తుల బెంగ అంతా సైబరియా కొంగల కోసం.. దశాబ్ద కాలం నుండి ప్రతి ఏటా జనవరి మాసంలో సైబీరియా దేశం నుంచి వందలాది కొంగల గుంపు వేలాది కిలోమిటర్లు ప్రయాణిoచి ఇక్కడకు చేరుకుంటాయి. వాటి రాకతో ఊరంతా సందడి వాతావరణం నెలకొంటుంది. తమ ఇంటికి చుట్టాలు వచ్చినట్లు గ్రామస్తులు భావిస్తుంటారు. ప్రతి ఇల్లు మురిసిపోతుంది. ఆ కొంగలు ఇక్కడే గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను తిరిగి తీసుకెళ్తుంటాయి. ఆరు నెలలపాటు ఆ పక్షుల కిలకీలలతో ఇక్కడ కొత్త వాతావరణం ఎంతో సందడిగా ఉంటుంది . స్థానికంగా వాటిని ఎర్రబోలు కొంగలు అంటారు. అవి వస్తే తమ గ్రామానికి అదృష్టమని గ్రామస్తులు భావిస్తున్నారు.

 

ముందుగా పైలెట్ కొంగలు రాక: సైబీరియా అత్యంత శీతల ప్రదేశం కావడంతో కొంగల సంతానోత్పత్తికి ప్రతి కూల పరిస్థితులు ఉండంతో సమ శీతోష్ణతి ఉండే భారత దేశాన్ని అందులోను ఇక్కడ గ్రామ అనుకూలమైన వాతావరణం ఉండటం తో అనేక ఏళ్లుగా వస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కొంగలు గుంపు జనవరిలో గ్రామానికి చేరుకోక ముందే కొన్ని కొంగలు చింతపల్లి చేరుకొని ఇక్కడ పరిస్థితిని పరిశీలిస్తాయి. వాతావరణం, చింత చెట్ల పరిస్థితి ఎలా ఉంది, నివాస యోగ్యం వంటి అంశాలను పరిశీలించి సైబీరియా వెళ్తుంటాయి. గుళ్లను ఏర్పాటు చేసుకొని పిల్లలను పొదిగే అవకాశం ఉంది అనుకుంటే మిగిలిన కొంగలు తీసుకొస్తుంటాయి. చింత చెట్లను ఆవాసంగా చేసుకొని కాపురాలు చేస్తుంటాయి. ఈ ఆరు నెలలు ఆడ కొంగలు గ్రుడ్లను పెట్టి పొదిగే వరకు మగ కొంగలు ఆహారం కోసం బయటకు వెళ్తుంటాయి. ఇవి ఎక్కువగా చేపలను ఇష్టంగా భుజిస్తాయి. ఊరి పక్కనే ఉన్న చెరువుతో పాటు పాలేరు , వైరా , పాకాల బయ్యారం, మహబూబాద్ ప్రాంతాల్లో చెరువులు, రిజర్వాయర్ లో చేపలను వేటాడుతుంటాయి. కిలో వరకు చేపలను నోట కరచుకొని తీసుకోని వస్తుంటాయి. అంతే కాకుండా మంచి నీళ్లను కుతిక లో దాచుకొని పిల్లలకు , ఆడ కొంగలకు ఇస్తుంటాయి. ఈ క్రమం లో పిల్లలు పెద్ద కావడంతో అవి తమ తో పాటు ఎంత దూరమైన ఎగురుతాయని భరోసా వచ్చిన తర్వాత అవి ఏర్పాటు చేసుకున్న గుళ్లను తీసివేసి గ్రామాన్ని విడిచి వెళ్తాయి.

పర్యాటకుల సందడి: గ్రామాల్లో వీటిని చూసేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ, వరంగల్ ఇతర ప్రాంతాల పక్షి ప్రేమికులు రాకతో పర్యాటక వాతావరణం నెలకొంటుంది. కొద్దిరోజులుగా జంటలుగా వచ్చిన సైబీరియా పక్షులు చెట్లను చూసి వెళ్ళిపోతున్నాయి. అవి ఆకాశంలో
విహరిస్తున్న సేపు గ్రామస్తులు వాటి వైపే చూస్తుంటారు. చెట్ల మీద వాలకుండా తిరిగి వెళ్లిపోవడంతో ఏదో కోల్పతున్నట్లు గ్రామస్తులు దిగాలుగా ఉన్నారు. గత ఏడాది కూడా అవి రాలేదని పంటల సరిగా పండలేదని గ్రామానికి చెందిన రామయ్య తెలిపారు. ఊరంతా కొంగలపై బెంగ ఉందని చెప్పారు

కారణం ఏమిటో ? సైబీరియా కొంగలు వేల కిలోమీటర్లు దాటి ఎన్నో ఏళ్లుగా గ్రామానికి వస్తున్నాయని గత ఏడాది రాలేదని , ప్రస్తుతము కూడా వచ్చి తిరిగి వెళ్లిపోవడంతో అవి రాకపోవడానికి కారణం తెలియక గ్రామస్తులు కలత చెందుతున్నారు. ప్రధానంగా గ్రామంలో కోతులబెడద తీవ్రంగా ఉంది. చింత చెట్లు కూడా తగ్గుతున్నాయి. ఈ కారణాల మరి ఏదైనా అంశాల అనేది అర్థం కాక గ్రామస్తులు బాధపడుతున్నారు పర్యాటక అధికారులు స్పందించి సైబీరియా కొంగల వచ్చే విధంగా ఇక్కడ పరిస్థితులు కల్పించాలని కోరుతున్నారు.

Related posts

నడుము – వెన్ను నొప్పి వేధిస్తుంటే.. ఇవి ట్రై చేయండి!

Drukpadam

మన దేశంలో సంతోషకరమైన రాష్ట్రం ఏది?

Drukpadam

మునుగోడులో గెలుపు బీజేపీదేనంటున్న మిషన్ ఛాణక్య సర్వే!

Drukpadam

Leave a Comment