Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రజాదరణ తట్టుకోలేకనే దాడులు… ఖమ్మం జిల్లా కాంగ్రెస్!

ప్రజాదరణ తట్టుకోలేకనే దాడులు… ఖమ్మం జిల్లా కాంగ్రెస్!
👉🏻అధికారం ఎవరి సొత్తూ కాదు
👉🏻రేవంత్ రెడ్డి పై దాడి అమానుషం
👉🏻జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
👉🏻జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హత్ యాత్ర కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ అల్లరి ముకలు దాడులకు పాల్పడుతున్నాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అన్నారు. జయశంకర్ భూ పాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి యాత్రకు భంగం కలిగించేందుకు స్థానిక ఎమ్మెల్యే తన టీఆర్ఎస్ రౌడీలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా బుధవారం ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ సెంటర్ లో కె సి ఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ…అధికారం ఉందని దాడులకు చేయడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. అధికారం ఎవరి సొత్తూ కాదని హితవు పలికారు. అధికారం ఉంటే అభివృద్ధి చేయాలి కానీ దాడులు చేయించడం ఏంటని ప్రశ్నించారు.యావత్ దేశం మార్పు కోరుకుంటుందని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించడం తప్పు గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరెన్ని దాడులు చేసిన మడమ తిప్పే సంస్కృతి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు లేదని సమస్య ఉన్నచోటే ఎదురోడ్డి పోరాడుతామని హెచ్చరించారు.కాంగ్రెస్ పై టొమాటో, చెప్పులు కాదు మానవ బాంబ్ లతో దాడి చేసినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపదని ఈ సంస్కృతి దివంగత నేత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ నుండి నేర్చుకున్నామని తెలిపారు.అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు మహ్మద్ జావేద్,పాలేరు నియోజకవర్గ పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరావులు మాట్లాడుతూ ఇటువంటి దాడులు పునరావృతం అయితే బి ఆర్ ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,నగర కాంగ్రెస్ కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు,నగర మైనారిటీ,ఓ బి సి సెల్ అధ్యక్షులు షేక్ అబ్బాస్ బేగ్,బాణాల లక్ష్మణ్,జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఏలూరి రజని,నగర మహిళా కాంగ్రెస్ నాయకులు పుష్ప,భూక్యా బాలాజీ,జిల్లా ఓ బి సి సెల్ నాయకులు బోయినపల్లి వేణు,నగర కాంగ్రెస్ నాయకులు సంపటం నరసింహారావు,పూర్ణ, శంకర్ నాయక్,గడ్డం వెంకటయ్య,తవిడబోయిన రవి,నూకారపు వెంకటేశ్వేరారావు,జహీర్,,వాసిమ్,మహామూద్,గౌస్,ముజాహిద్దీన్,బచ్చలకూర నాగరాజు,జెరరిపోతుల అంజనీకుమార్,మోహన్,గాదర్ బాబు,యడవల్లి నాగరాజు,నగేష్, రియాజ్,కళ్యాణ్,పేరం యశ్వంత్,సాయి,హరి నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ లో టీడీపీ కీం కర్తవ్యం…అధ్యక్షుడా ?సమన్వయ కమిటీ నా ??

Drukpadam

జగన్ ఒంటిమిట్టకు వెళ్లకుండా కుంటిసాకు…అచ్చెన్నాయుడు విమర్శ …

Drukpadam

హైకోర్టు లో ఏపీ సర్కార్కు మరో ఎదురు దెబ్బ…

Drukpadam

Leave a Comment