Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం.. ఢీకొన్న 6 కార్లు!

రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం.. ఢీకొన్న 6 కార్లు!

  • సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రమాదం
  • ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో రేవంత్ కు తప్పిన ప్రమాదం
  • స్వల్ప గాయాలతో బయటపడ్డ రిపోర్టర్లు

రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర రాష్ట్రంలో జోరుగా సాగుతుంది …ఆయాత్రలకు ప్రజల నుంచి స్పందనకూడా కనిపిస్తుంది. సవాళ్లు ,ప్రతిసవాళ్ళతో సాగుతున్న ఈ యాత్ర సిరిసిల్ల జిల్లాలో అపశృతి చోటుచేసుకుంది. ఒకదాని వెంట ఒకటి గా వెళుతున్న రేవంత్ రెడ్డి కాన్వాయిలో ముందుగా వెళుతున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనక ఉన్న కార్లు ఒకడు ఒకటి గుద్దుకున్నాయి. దీంతో పెద్ద ప్రమాదం జరిగిందని అందరు భావించారు . ఈ కాన్వాయ్ లో మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు . కానీ చిన్న చిన్న గాయాలతో అందరు క్షేమంగా బయటపడ్డారు .

 రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ప్రమాదం చోటు చోటు చేసుకోవడంతో అందరు నిశ్రేష్టులు అయ్యారు.. వేగంగా వెళుతున్న కాన్వాయ్ లో 6 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కార్లలో రెండు కార్లలో మీడియా ప్రతినిధులు ఉన్నారు. వీటిలో టీవీ9, ఎన్టీవీ, సాక్షి, ఏబీఎన్, బిగ్ టీవీ న్యూస్ నౌ రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. సిరిసిల్ల రిపోర్టర్లయిన వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

ఏపీ పోలీసులు కు చిక్కిన ముగ్గురు చడ్డీగ్యాంగ్ ముఠా సభ్యులు!

Drukpadam

ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ వీరంగం…

Drukpadam

ఏవి సుబ్బారెడ్డి పై దాడికేసులో భూమా అఖిల ప్రకియ అరెస్ట్ …

Drukpadam

Leave a Comment