Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి ఘాటు విమర్శలు …

కేసీఆర్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి ఘాటు విమర్శలు …
– తెలంగాణ లో కానరాని అభివృద్ధి…- సొల్లు మాటలకే కేసీఆర్ ప్రభుత్వం పరిమితం
-యువత బలిదానాలతో తెలంగాణ సిద్ధించిందన తెలంగాణ
-యువతకు ఉద్యోగాలు లేవు …నిరుద్యోగభృతి లేదు
– రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువత మద్ధతు శీనన్నకు కావాలి
– నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న రైటాఛాయిస్ ఛైర్మన్ మెండెం కిరణ్ కు అభినందనలు

యువత బలిదానాలతో… మేధావుల ఆత్మహుతితో… అనేక మంది యోధనయోధులు శ్రమ, కృషితో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువతకు ఉద్యోగాలు వస్తాయని… నిరుద్యోగ భృతి అందుతాయని కన్న కలలు కల్లలుగానే మిగిలిపోయాయి… ఎన్నికలు వచ్చినప్పుడు నోటిఫికేషన్లు రావడం పరిపాటిగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చాం… ఎంతమందికి అపాయింట్ మెంటు ఆర్డర్లు ఇచ్చాం అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ఎంఆర్ గార్డెన్స్ లో రైటాఛాయిస్ ఛైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు ముఖ్యఅతిథిగా హాజరైన పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగులకు ఒరిగిపోయిందేమి లేదన్నారు. తల్లిదండ్రులు, గురువులు, తోబుట్టువులు కన్న కలలు నేరవేర్చాలని నిరుద్యోగులు తాపత్రాయపడుతుంటే ఆ కలలను కల్లాలుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంచుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సుమారు 80వేల ఖాళీలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య లక్షకు దాటిందని అయినా వాటి భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువత మద్ధతు శీనన్నకు కావాలని కోరారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమనే విషయాన్ని రాబోయే ఎన్నికల ద్వారా మరోమారు నిరూపితం చేయాలని పిలుపునిచ్చారు. అధికారం ఉన్నా… లేకున్నా అన్ని విధాల శీనన్న అండదండలు ఉంటాయని యువతకు హామీ ఇచ్చారు. నిరుద్యోగుల పక్షాన నిలబడుతూ వారి కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైట్ ఛాయిస్ మెండెం కిరణ్ కుమార్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. యువతలో ఉత్తేజం కలిగింపజేసేందుకు ఇలాంటి సెమినార్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని కిరణ్ కుమార్ను కొనియాడారు. రాబోయే రోజుల్లో కిరణ్ సహకారంతో పొంగులేటి శీనన్న ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో జాబేళాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటిని గజమాలతో ఘనంగా సత్కారించారు.

అందరి బంధువుగా ఉంటా ఆదరించండి …బయ్యారంలో పొంగులేటి

గడిచిన ఎనిమిదిన్నర సంవత్సర కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో నాయకుల మాటలు… హామీలకే పరిమితమైనాయి తప్ప ఆచరణ లో మాత్రం ఐదు శాతం కూడా అభివృద్ధికి నోచుకోలేదని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. బయ్యారం మండల కేంద్రంలో పొంగులేటి శీనన్న, కోరం కనకన్నల పేరుతో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో శనివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి బంధువుగా… నిరుపేదలను ఆదుకోనేందుకు శీనన్న ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడన్నారు. అభివృద్దే లక్ష్యంగా పార్టీల కు అతీతంగా మనందరం కలిసి పనిచేద్దామని… మీ సూచనలు సలహాల మేరకు నడుచుకుంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎనాడైనా నాయకులు ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడ్డారా అని ప్రశ్నించారు. ఇల్లందు నియోజక వర్గంలో ఆదివాసులు, గిరిజనులు, గిరిజనేతరులకు అభివృద్ధి ఫలాలు అందాయా అని ప్రశ్నించారు. రైతులకు రుణ మాఫీ, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు ఫీజు రీయంబర్సుమెంటు దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం వచ్చాయా అని ప్రశ్నించారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎక్కడ ఉంచాలో మీరే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం… రాబో యే రోజుల్లో మీకు అందు బాటులో ఉంటూ ఎల్ల వేళలా మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో శీనన్న క్యాంపు కార్యాలయాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ఈ కార్యాలయాల ఏర్పాటుకు రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కోరం కనకయ్య, మండల సర్పంచ్ పొలే బోయిన వెంకటేశ్వర్లు, నాయకులు సంకు సత్తిరెడ్డి, వన్నం రామారావు, రెంటాల బుచ్చిరెడ్డి, సర్పంచులు, ఎంపిటిసి లు సనప సోమేష్ తదితరులు పాల్గొన్నారు.

[videopress oF7JOFyZ]

 

 

Related posts

కేసీఆర్ మోసం చేశారు …కేటీఆర్ వదిలేశారు …ఇల్లందు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

బిజెపి నేతల్లారా ఖబడ్దార్ : మంత్రి సత్యవతి రాథోడ్ వార్నింగ్

Drukpadam

లెఫ్టినెంట్​ గవర్నర్​ చేతుల్లోకి ఢిల్లీ పాలన…ఉత్సవ విగ్రహంగా సీఎం

Drukpadam

Leave a Comment