Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది-కేటీఆర్

• కొవిడ్ కట్టడి కోసం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ తొలి మీటింగ్  ఈ రోజు సచివాలయంలో జరిగింది

• ప్రధానంగా చర్చించిన అంశాలు…. 

• ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న హోం ఇసోలేషన్ మందుల నిల్వలో ఎలాంటి కొరత లేదు

• ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఇంటి ఇంటికి సర్వే చేస్తూ… అవసరం అయిన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నాం. 

• ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయింది.

• ఇప్పటి దాకా 2.1 లక్షల కిట్స్ ఇచ్చాము. ఇది ఇన్ పేషంట్ విజిట్స్ అదనము

• ప్రభుత్వము చేస్తున్న ప్రయత్నం వలన వేలాది మందిని కాపడగలము… ఈ మందులను కోవిడ్ లక్షణాలు రాగానే ఈ మందులు వాడడం వలన సీరియస్ కండిషన్ లో హాస్పిటల్ అవ్వాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది… ఈ ప్రయత్నం పలితాలు ఒకటి రెండు రోజుల్లో కనిపిస్తుంది అన్న ఆశాభావం ఉన్నది

• రాష్ట్రంలో బెడ్స్ భారీగా పెంచాము…. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు లో ఆసుపత్రులు సైతం భారీగా పెరిగాయి. 

• Remdesivir లాంటి మందుల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 Lacs ఇంజెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంజెక్షన్లు తయారుచేస్తున్న కంపెనీల నుంచి అదనపు సరఫరాకు సమన్వయము చేస్తాము.

• దీంతో పాటు ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ వినియోగం పైన వివరాలు తీసుకుంటున్నాము. వీటి వినియోగం పైన ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తాం

• వీటితో పాటు రోగులు సీరియస్ గా అరుదుగా, అత్యవసరంగా వాడుతున్న టోలిసిజుమాబ్ వంటి మరిన్ని మందుల సరఫరా కూడా సరిపడేలా చూసుకోవాలని సూచన

• బ్లాక్ ఫంగస్ అంశంలో కూడా ప్రభుత్వం అలెర్ట్ గా  ఉంది… దీనికి అవసరం అయిన మందులను ప్రభుత్వం procure చేస్తున్నాము

• ఆక్సిజన్ సప్లై గురించి కూడా చర్చించాము, ప్రస్తుతానికి అవసరము అయిన డిమాండ్- సప్లై పైన వివరాలు తిస్కున్నాము. oxygen audit ప్రభుత్వము చేస్తుంది…. అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల తో ఆక్సిజన్ వినియోగానికి అవసరమైన మేరకే వాడేలా చర్యలు

• కోవిడ్ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నంబర్ ఉండేలా చర్యలు తిస్కోవాలని సూచన

• జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు… మంత్రులు చేస్తున్న పర్యవేక్షణ చర్యలతో సమన్వయం అధికారులకు సూచించాము 

• ….వ్యాక్సిన్… 

• రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షలు గా ఉన్నది.

• ఇందులో ఇప్పటికే 38 లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు.

• వీరిలో 7.15 లక్షల మందితో పాటు  3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నారు. మొత్తంగా 10 లక్షలకు పైగా జనాభా పూర్తి వాక్సిన్ తీసుకున్నారు. 

• వాక్సిన్ ప్రజలకు అందించెందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ప్రారంభించింది
• రానున్న రోజుల్లో కరోనాకి చికిత్సకు అవసరమైన మందుల తయారీ దారులతో పాటు… వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం అవుతాము
• ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేందుకు కైనా సిద్ధంగా ఉన్నాము.
• తెలంగాణ ప్రభుత్వం కరోనా కోసం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి
• ఇతర రాష్ట్రాల పరిస్థితులతో పోలిస్తే తెలంగాణలో మంచి పరిస్థితి ఉంది
• తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల సత్ఫలితాలను ఇస్తున్నాయి… ప్రభుత్వ చర్యలను కేంద్రం కూడా గుర్తించింది…. కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ మేరకు అభినందించారు.
• ఎప్పటికప్పుడు కరోనా కట్టడికి చర్యలను ముమ్మరం చేస్తున్నాము…. మరింత సమగ్రంగా కార్యాచరణ తీసుకుని ముందుకు పోతాం….
• టాస్క్ ఫోర్స్ సమావేశాలు వరుసగా కొనసాగే ఒక సమగ్ర కార్యాచరణ దిశగా ముందుకుపోతాము

Related posts

సీబీఐ పరిస్థితి పంజరంలో రామ చిలుకలా ఉంది.. వెంటనే దానిని విడుదల చేయండి..: మద్రాస్​ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

డ్రగ్స్ సమూలంగా నిర్ములించాలి …సీఎం కేసీఆర్…

Drukpadam

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్సన్ ఎత్తి వేత …

Drukpadam

Leave a Comment