Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇటు బీఆర్ యస్ ….అటు బీజేపీ మహిళల పేరుతో పోటాపోటీ ధర్నాలు …

ఇటు బీఆర్ యస్ ….అటు బీజేపీ మహిళల పేరుతో పోటాపోటీ ధర్నాలు …
-చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలని జంతర్ మంతర్ వద్ద కవిత ఆధ్వరంలో దీక్ష
-మహిళా గోస …బీజేపీ భరోసా పేరుతో బీజేపీ ధర్నా
-లిక్కర్ స్కాం నుంచి తప్పించుకునేందుకే కవిత డ్రామాలని విమర్శలు
-మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న మోడీ మాటతప్పారన్న ఏచూరి

మహిళలపేరుతో రెండు ప్రధాన పార్టీలు ధర్నాకు పూనుకొవడం చర్చనీయాంశంగా మారింది .మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఉండాలని భారత జాగృతి పేరుతో బీఆర్ యస్ కు చెందిన తెలంగాణ ఎమ్మెల్సీ ,సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీలో ని జంతర్ మంతర్ వేదికకాగా ధర్నా చేపట్టారు .ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ధర్నాలో 18 పార్టీలకు చెందిన మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు .గత 26 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉద్యమాలు జరుగుతున్నాయని ధర్నాను ప్రారంభించిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు . సిపిఎం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం ఉండాలని మొదటి నుంచి కోరుతుందని రాజ్యసభలో కూడా ఈ బిల్లును తమ పార్టీ పూర్తిగా సమర్దించిందని పేర్కొన్నారు . ధర్నాకు నాయకత్వం వహించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బీజేపీ నేత ప్రధాని మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని ప్రధాని కాకముందు కోరాడని , 2014 ఎన్నికలకు ముందు కూడా మోడీ మహిళా బిల్లుకు కట్టుబడి ఉన్నామని చెప్పారని అధికారంలోకి వచ్చిన దాన్ని గురించి మర్చిపోయారని విమర్శించారు . సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో బిల్లు పెట్టిన విషయాన్నీ ఆమె గుర్తు చేశారు . ధర్నా కార్యక్రమంలో బీఆర్ యస్ పార్లమెంటరీ పార్టీ నేత కె .కేశవరావు , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , సిపిఐ జాతీయ కార్యదర్శి కె .నారాయణ వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా నాయకులు పాల్గొన్నారు . తెలంగాణ నుంచి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి ,సత్యవతి రాథోడ్ , ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు .

మహిళా గోస …బీజేపీ భరోసా

మహిళా గోస …బీజేపీ భరోసా పేరుతో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వరంలో డీకే ఆధ్వరంలో ధర్నా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కవిత చేస్తున్నవి దీక్షలు కాదని డ్రామాలని విమర్శలు గుప్పించారు. ఒకపక్క లిక్కర్ స్కాం లో ఈడీ విచారణకు హాజరు కావాలని కోరుతుంటే మరో పక్క మహిళలకోసం తాను ఎదో చేస్తుంటే అడ్డుకున్నారని తన కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకు నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు . 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కవిత తండ్రి కేసీఆర్ మహిళలను మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు . బీఆర్ యస్ లోకసభ , శాసనసభలకు జరిగే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం ఇస్తామంటే ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలని అన్నారు . ఈడీ స్కాములో ఉన్న కవితను విచారణకు రమ్మని అంతే మహిళల రిజర్వేషన్లు గుర్తురావడం విచిత్రంగా ఉండాని ,కవిత డ్రామాలను ప్రజలు గ్రహిస్తున్నారని దెప్పిపొడిచారు .

కవిత కు చిత్తశుద్ధి ఉంటే ప్రగతి భవన్ ఎదుట దీక్ష చేపట్టాలన్న షర్మిల

తెలంగాణలో ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారంటూ ప్రశ్నించిన వైనం
ఢిల్లీలో దీక్ష చేపట్టడం హాస్యాస్పదం అని విమర్శలు

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. కవిత ముందుగా ప్రగతి భవన్ ఎదుట పోరాటం చేయాలని హితవు పలికారు. లిక్కర్ స్కాం నుంచి తప్పించుకోవడానికే కవిత ఈ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.

2014 ఎన్నికల్లో కేసీఆర్ రాజకీయంగా ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారు? 119 స్థానాలకు గాను 6 స్థానాల్లో మహిళలకు అవకాశం ఇచ్చారు. 2018లో ఎంతమందికి అవకాశం ఇచ్చారు?… నలుగురికి ఇచ్చారు అంటూ వివరించారు. తెలంగాణలో మహిళా కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అంటూ మండిపడ్డారు.

గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే కవిత ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అలాంటి కవిత ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తుండడం హాస్యాస్పదం అని షర్మిల పేర్కొన్నారు.

తెలంగాణలో కనీసం నాలుగైదు శాతం కూడా మహిళా రిజర్వేషన్ లేదు కానీ, ఢిల్లీలో మీరు పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడం చూస్తుంటే మీకు చిత్తశుద్ధి ఉందని నమ్మాలా? అని నిలదీశారు. లిక్కర్ స్కాంలో రేపో మాపో అరెస్ట్ కాబోతోందని తెలిసే, ఇప్పుడీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని షర్మిల ఆరోపించారు.

Related posts

అవినీతిపరులంతా ఒక్కటవుతున్నారు.. మా పద్ధతి మారదు: విపక్ష నేతలపై మోదీ ఫైర్!

Drukpadam

మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. ఉద్రిక్త‌త‌!

Drukpadam

మోదీ కాన్వాయ్‌ను అడ్డగించింది మేమే.. ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ !

Drukpadam

Leave a Comment