Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రానున్న కురుక్షేత్ర యుద్ధంలో కేసీఆర్ ఇంటికే …సత్తుపల్లో సభలో పొంగులేటి …

రానున్న కురుక్షేత్ర యుద్ధంలో కేసీఆర్ ఇంటికేసత్తుపల్లో సభలో పొంగులేటి
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దే
కేసీఆర్ మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
మావాళ్లను ఇబ్బందులు పెడుతున్నారుఅధికారం శాశ్వితం కాదని గుర్తుంచుకోండి
దళిత బందు ఎక్కడ …? నిరుద్యోగ భృతి ఏదీ..?
రైతుల రుణమాఫీ ఏమైంది సీఎం సార్
-12 తేదీన వచ్చిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వని ప్రభుత్వం
జెండా ఏదైనా ,గుర్తు ఏదైనా శీనన్న అభ్యర్థులను గెలిపించండి

రానున్న కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలను మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి , దగుల్బాజీ విధానాలతో పరిపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ఇంటికి పోక తప్పదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు .ఆదివారం సాయంత్రం సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేసీఆర్ విధానాలపై తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు . సీఎం కేసీఆర్ కు మైక్ దొరికితే కడుపులో చల్ల కదలకుండా అందమైన అబద్దాలతో ప్రజలను బురిడీ కొట్టిస్తారని అందులో ఆయన ఆరితేరాడని వ్యంగ్యబాణాలు సంధించారు . ప్రజల మభ్యపెట్టి ,మసిపూసి మారేడు కాయచేయడంలో ఆయనకు తెలిసినంత విద్య ఎవరికీ తెలియదని కేసీఆర్ వైఖరిపై చురకలు అంటించారు . ఇప్పటికైనా ప్రజలు ఆయన మాయమాటలు ,మోసపు వాగ్దానాలు ,నమ్మకుండా ఉండాలని పిలుపు నిచ్చారు .

ధనిక రాష్ట్రమైన తెలంగాణ 5 లక్షల కోట్లు అప్పులు మారిందని , ఘనత కేసీఆర్ కే దక్కుతుందని విమర్శలు గుప్పించారు .తనకు అధికారం ఇస్తే బంగారం తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ లిక్కర్ బిజినెస్ లో నెంబర్ వన్ గా నిలిపి ఆడబిడ్డల ఉసురు తీసుకుంటున్నారని మండిపడ్డారు . ఇదేనాకేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు . 2018 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులకు ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం ఐదు లక్షల మందికే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు . లక్షల్లో డబుల్ బెడ్ రూమ్ లు అన్నారు ఎంతమందికి కట్టించారని నిలదీశారు . ఎన్నికలకు ముందు సొంతస్థలం ఉంటె 5 లక్షలు ఇస్తామని ఇప్పుడు సొంతస్థలం ఉంటె 3 లక్షలు ఇస్తామంటూ ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకు మాయమాటలు చెపుతున్నారని వాటిని ఎవరు నమ్మవద్దని అన్నారు . హుజారాబాద్ ఎన్నికల సందర్భంగా దళితబంధు అని పెట్టి ఓట్లు పొందాలనుకుంటే అక్కడ ప్రజలు కేసీఆర్ ను ఈడ్చి కొట్టారని గుర్తు చేశారు . నియోజకవర్గానికి 500 యూనిట్లున్నారు .వాటిని ఇవ్వలేదు…. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు నియోజవర్గానికి 1100 యూనిట్లు అన్నారు . వాటికీ 13 వేల కోట్లు కావాలి , రైతు రుణమాఫీకి 12 వేల కోట్లు కావాలిఈనిధులు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారునిరుద్యోగులకు భృతి ఇస్తామని అన్నారు . అది ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు . ప్రభుత్వం చెప్పే లెక్కలకు ఉన్న బడ్జెట్ కు పొంతనలేదని ఇది ప్రజలను వంచించేందుకేనని తెలుసుకోవాలని కోరారు .గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వరుఅనేక పంచాయతీలు చేసిన అప్పుల బిల్లులు చెల్లించక అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు .

60 సంవత్సరాల తెలంగాణ కోరిక సాకారం అయినవేళ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ను, మద్దతు ఇచ్చిన బీజేపీని మోసం చేసిన చరిత్ర కేసీఆర్దేనని ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమాఅని ప్రశ్నించారు .శీనన్న మీకు అండగా ఉంటాడు …. మీ కుటుంబ సభ్యుడుగా ఉంటాడు …. పార్టీ ఏదైనా, గుర్తు ఏదైనా శీనన్న నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు .

సభకు సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి వేలాదిగా ప్రజలను సమీకరించారు . సభకు వచ్చే వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేశారని, ప్రభుత్వ పథకాలు ఇవ్వమని బెదిరిస్తున్నారని అధికారం ఎవరికీ శాశ్వితం కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు . సభలో భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ ,మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు , స్వర్ణ కుమారి , తుళ్లూరు బ్రహ్మయ్య , తదితర నాయకులు పాల్గొన్నారు .

Related posts

అగ్రనాయకుల మధ్య చిచ్చుకు కారణమైన కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ర్యాలీలు…

Drukpadam

అసెంబ్లీలో భట్టి, మంత్రి హరీశ్ రావు మధ్య ‘జల’ యుద్ధం!

Drukpadam

ఛోటా చంద్రబాబు’ అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు..!

Drukpadam

Leave a Comment