Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలు.. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం…

పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలు.. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం…

  • రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామన్న గవర్నర్ 
  • సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ముందుకెళ్తున్నట్లు వివరణ
  • లబ్దిదారులకు నేరుగా లబ్ది చేకూరుతోందన్న గవర్నర్

ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం పది గంటలకు ఉభయసభల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలలో అవినీతికి తావివ్వకుండా జాగ్రత్తపడుతున్నామని పేర్కొన్నారు. అర్హుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ముందడుగు వేసిందని, వ్యవసాయంతో పాటు మిగతా రంగాల్లోనూ ప్రగతిపథంలో నడుస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జీడీపీ వృద్ధి 11.43 శాతంగా నమోదైందన్నారు. 2020-21 ఏడాదిలో జీడీపీ వృద్ధికి సంబంధించి ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.

Related posts

సిసోడియాకు ఓ రూలు.. జగన్‌కు మరో రూలా?: సీపీఐ రామకృష్ణ..

Drukpadam

ఎన్టీఆర్ ను అవమానించినట్టే.. హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పురందేశ్వరి!

Drukpadam

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ నారాయణ!

Drukpadam

Leave a Comment