Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

సిపిఎం నాయకులపై తప్పుడు కేసులు పెట్టటం మానుకోవాలి…

సిపిఎం నాయకులపై తప్పుడు కేసులు పెట్టటం మానుకోవాలి…
-నిర్మాణంలో లోపాలను ఎత్తిచూపితే పోలీసులకు ఎందుకు కోపం..? – పోతినేని,నున్నా
-తమ ప్రతి నాయకులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తి వేయాలని డిమాండ్
-కొత్త బస్టాండ్ ను సందర్శించిన సిపిఎం నేతలు పోతినేని, నున్న , పొన్నం

కొత్త బస్టాండ్ లో జరిగిన నిర్ణ లోపాలను ప్రశ్నిస్తే తప్పేలా అవుతుందని సిపిఎం నాయకులూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు లు అన్నారు.ఇదెక్కడి న్యాయం తప్పులు ఎత్తిచూపితే కేసులు పెడతారా ? అని వారు పేర్కొన్నారు.తమ పార్టీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిజ నిర్దారణ కోసం వారు బస్టాండ్ ను సందర్శించారు.
సిపిఎం టూ టౌన్‌ కార్యదర్శి వై.విక్రం, మాజీ కౌన్సిలర్‌, పార్టీ సీనియర్‌ నాయకులు నర్రా రమేష్‌, జి. వెంకన్నబాబులపై సెక్షన్‌ 353 క్రింద నాన్‌ బెయిలబుల్‌ కేసు పెట్టటాన్ని తీవ్రంగా ఖండించారు.
20 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి నిర్మించిన బస్‌ స్టేషన్‌ వర్షం వచ్చినప్పుడల్లా కురుస్తుంటే, ప్రజలకు అసౌకర్యంగా ఉంటే ప్రశ్నించటం దేశద్రోహంగా ఖమ్మం పోలీసులు భావిస్తున్నారా అని ప్రశ్నించారు.
సోమవారం నాడు కురిసిన వర్షానికి బస్‌ స్టేషన్‌లో తడిసిన ప్రయాణికులు ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. పత్రికల్లో వార్తలొచ్చాయి. దానిని పరిశీలించిన తమ నాయకులు దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరినట్లుగా పత్రికల్లో వచ్చిన వార్త చూసి విక్రం తదితరులు బస్‌ స్టేషన్‌కు వెళ్ళి ఫోటోలు తీశారని అక్కడ సిబ్బందిని బెదిరించారని ఒక చిన్నపాటి ఉద్యోగితో పిటిషన్‌ తీసుకొని కేసు నమోదు చేయటం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
ఈరోజు తాము ముగ్గురం కొత్త బస్‌ స్టేషన్‌ను స్వయంగా పరిశీలించామని, వర్షం కురిసిన విషయం స్పష్టంగా ఉందని, ఊడిపోయిన సీలింగ్‌ను బాగు చేసిన గుర్తులున్నాయని, అక్కడ సిబ్బందిని అడిగితే సిపిఎం కార్యకర్తలు అక్కడ ఎవరిని ప్రశ్నించలేదని, గొడవ ఏమీ జరగలేదని ప్రత్యక్షంగా వున్న కార్మికులు చెప్పారని తెలిపారు.. పోలీసులు కేసులు పెట్టె దానిపై తీసుకునే శ్రద్ధ కరోనా సమస్యలపై పెడితే ప్రజలకు మేలు జరుగుతుందని వారు అన్నారు.
ఈ విషయంపై పోలీసు కమీషనర్‌కి, డిజిపి దృష్టికి తెస్తామన్నారు. పోలీసులు ఉన్నది కాంట్రాక్టర్ల కోసం కాదని, ప్రజలు ,ప్రజల క్షేమం కోసం అని గ్రహించాలన్నారు.

Related posts

జ‌ర్న‌లిస్టుల‌కు జాగ్వార్ కార్లిస్తే.. టీఆర్ఎస్‌లో చేర‌తానంటున్న జగ్గారెడ్డి!

Drukpadam

టీఆర్ యస్ మీడియా సంస్థల ప్రతినిధులపై బీజేపీ నిషేధం ….

Drukpadam

పార్టీలకు అందిన విరాళాలు …ప్రకటించిన ఎన్నకల సంఘం…

Drukpadam

Leave a Comment