Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవ్-మంత్రి పువ్వాడ….

ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవ్-మంత్రి పువ్వాడ…

-ఐ టి సి భద్రాచలం నుంచి రోజుకు 5 టన్నుల ఆక్సిజన్ లిక్విడ్
-ట్యాంకర్ ను లాంఛనంగా ప్రారంభించిన పువ్వాడ

ఖమ్మం లో ఇక ఆక్సిజన్ కు ఇబ్బందులు లేనట్లే నని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గత కొద్దీ రోజులుగా ఖమ్మం లో ఆక్సిజన్ కొరతతో రోగులు గగ్గోలు పెట్టారు.హాస్పటలస్ యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఆక్సిజన్ లేకపోతె కొన్ని ప్రాణాలు పోయే పరిస్థితి . దీన్నుంచి బయటపడేందుకు అధికారులు నాన హైరానా పడ్డారు. దీనిపై ద్రుష్టి సారించిన మంత్రి అజయ్ ఉమ్మడి జిల్లాలో ఉన్న భద్రాచలం పేపరు బోర్డు లో ఉన్న ఆక్సిజన్ లిక్విడ్ ను ఉపయోగించుకునేందుకు ఈ కంపెనీ ఉన్నతాధికారులతో మాట్లాడారు.వారు స్పందించి రోజుకు ఐదు మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ లిక్విడ్ సరఫరా చేసేందుకు అంగీకరించారు. మొదట ట్యాంకర్ ను గురువారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.


కరోనా రెండో దశ ఉద్ధృతితో ఆక్సిజన్‌ కొరత తీవ్రమైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో మన రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్ చొరవ తీసుకొని స్వయంగా రంగంలోకి దిగి ఐటిసి యజమాన్యాన్ని ఒప్పించారు.

నేటి నుంచి ఐటీసీ భద్రాచలం నుండి ప్రతి రోజు ఖమ్మంకి అయిదు మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి ఆయా ఆక్సిజన్ రవాణాకు ప్రత్యేకంగా ట్యాంకర్ ను సమకూర్చారు. ఆయా ఆక్సిజన్ ట్యాంకర్ ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ , పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్ తో కలిసి ప్రారంభించారు.

ప్రతి రోజు సరఫరా అయ్యే ఐదు మెట్రిక్ టన్నుల ప్రాణ వాయువు ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రులకు సరిపడు ఆక్సిజన్ ను అందించనున్నామని, ఇక ఆక్సిజన్ కు ఎలాంటి కష్టాలు ఉండబోవన్నారు.

గత పది రోజులగా కరోనా తీవ్రత రోగుల రద్దీ పెరిగి ఆక్సిజన్ దొరక్క రోగులు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రమంలో ప్రాణవాయువు అందుబాటులో లేక ఆసుపత్రులు సైతం బాధితులను రక్షించలేని పరిస్థితుల్లో మంత్రి అజయ్ కుమార్ గారు పట్టు విడవకుండా చేసిన కృషితో ప్రస్తుత అందుబాటులోకి వచ్చిన ఆక్సిజన్ తో కష్టాలు తిరిపోయాయన్నారు.

కార్యక్రమంలో డి అండ్ హెచ్ ఓ మాలతి గారు, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు , వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

Related posts

ఒమిక్రాన్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది…కఠిన నిర్ణయాలు తప్పనిసరి: డ‌బ్ల్యూహెచ్‌వో!

Drukpadam

ఇక్కడెవరూ పట్టించుకోవడం లేదు..కన్నీరు మున్నీరుతో ఓ యూ విద్యార్ధి కన్ను మూత

Drukpadam

తెలంగాణకు చెడ్డపేరు తీసుకురావద్దు… ఏపీ అంబులెన్సులను నిలిపివేతపై : జగ్గారెడ్డి

Drukpadam

Leave a Comment