Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల కష్టాలు తెలుసు అందుకే ప్రత్యేక యాప్ :సి జె ఐ ఎన్ వి రమణ…

జర్నలిస్టుల కష్టాలు తెలుసు అందుకే ప్రత్యేక యాప్ :సి జె ఐ ఎన్ వి రమణ
జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిన సుప్రీం కోర్టు
-యాప్ ను ప్రారంభించిన సి.జె.ఐ జస్టిస్ ఎన్.వి రమణ
-సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారానికి నేను సిద్ధం: సి.జె.ఐ ఎన్.వి రమణ
– ప్రత్యక్ష ప్రసారాలపై సహ న్యాయమూర్తులతో చర్చిస్తాం: సి.జె.ఐ

దేశం అత్యఉన్నత న్యాయస్థానం ప్రజాస్వామ్యానికి నాలుగవస్తంభంగా భావిస్తున్న మీడియా కోసం ప్రత్యేక యాప్ ను తెచ్చింది.ఇది ప్రజాస్వామ్య వ్యస్థలో మరో ముందడుగనే అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కీలక ఘట్టంగా భావిస్తున్నారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల భాద్యతలు స్వీకరించిన జస్టిస్ ఎన్ .వి రమణ ఈ యాప్ ను ప్రారంభిస్తూ తాను జర్నలిస్టుగా బస్సు లలో తిరిగిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు పడుతున్న భాదలు తెలుసునని అన్నారు. నిత్యం కోర్ట్ కార్యకలాపాలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ యాప్ కు రూపకల్పన జరిగిందన్నారు.జస్టిస్ జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్ ల ఆధ్వర్యంలో యాప్ రూపకల్పనలో ఎంతో శ్రద్ద తీసుకొని దీన్ని రూపొందించారని తెలిపారు.వారిని సి జె ఐ ప్రత్యేకంగా అభినందించారు. సుప్రీం కోర్ట్ కు మీడియా కు మధ్య వారిదిగా ఉండేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తామని సి జె ఐ వెల్లడించారు. అక్రిడేషన్ ల విషయంలో కూడా హేతుబద్దంగా వ్యవహరిచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

సుప్రీం కోర్ట్ కార్యకలాపాలను పారదర్శికంగా ఉంచేందుకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తాను సిద్ధం అని ఈ విషయాన్నీ ఇతర న్యాయమూర్తులతో కూడా చర్చించి ప్రయత్నాలు వేగవంతం చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో దేశ అత్యఉన్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు.

 

Related posts

తెలంగాణ ఫీవర్‌ సర్వే దేశానికే ఆదర్శం… మంత్రి హరీష్ రావు

Drukpadam

యుద్ధానికి విరామం…

Drukpadam

తులం బంగారం …40 వేలు ఎక్కడ …? అభ్యర్థులకు ఓటర్ల ప్రశ్న …?

Drukpadam

Leave a Comment