Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సిపిఎం ప్రజాచైతన్య యాత్రలకు ప్రజల నుంచి స్పందన ….

సిపిఎం ప్రజాచైతన్య యాత్రలకు ప్రజల నుంచి స్పందన ….
కేసీఆర్ కు హ్యాట్సాఫ్ అంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…
మోడీ పాలనలో పేదల బ్రతుకులు దిగజారుతుంటే …కార్పొరేట్ల ఆస్తులు పెరుగుతున్నాయని ధ్వజం
రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో కేంద్రం విఫలమైందని విమర్శ …
ఒకే భాష , ఒకే ఎన్నిక , ఒకే మతం ,అంటున్న బీజేపీ ఒకే కులం ఎందుకు అనడంలేదని ప్రశ్న …
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ యస్ తోనే ప్రయాణమని తమ్మినేని స్పష్టికరణ …
సిపిఎం,సిపిఐ పరస్పరం పోటీపడవన్న తమ్మినేని
జయప్రదంగా కొనసాగుతున్న సిపిఎం ప్రజాచైతన్య యాత్ర
యాత్రకు బీఆర్ యస్ ఎమ్మెల్యేల మద్దతు
తల్లాడ , వైరా లలో యాత్రలో పాల్గొన్న సండ్ర , రాములు నాయక్
మధిరలో మద్దతు తెలిపిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్

బీజేపీ విధానాలను నిరసిస్తూ సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలు జయప్రదంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రవేశించిన ఈ యాత్రకు బీఆర్ యస్ కు చెందిన సత్తుపల్లి , వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , లావుడ్య రాములు నాయక్ లు తల్లాడ , వైరాలో జరిగిన యాత్రలో పాల్గొని యాత్రకు మద్దతు తెలిపారు . యాత్రలో తమ్మినేని తోపాటు , సిపిఎం రాష్ట్ర నాయకులూ పోతినేని సుదర్శన్ , పాలడుగు భాస్కర్ ,ఎం సాయిబాబా ,మల్లు లక్ష్మి ,సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు , జిల్లా నాయకులు కళ్యాణం వెంకటేశ్వరావు , బొంతు రాంబాబు ,వీరభద్రం ,తదితరులు పాల్గొన్నారు . ఈసందర్భంగా ఆయా మండలాల్లో జరిగిన సభల్లో తమ్మినేని మాట్లాడారు .

బీజేపీని ఓడించడమే సిపిఎం లక్ష్యం …తమ్మినేని

దేశంలో విచిన్నకార రాజకీయాలను , రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా ప్రభుత్వాలను పడగొడుతూ ,తమ చెప్పు చేతుల్లో ఉండే వారిని అధికారంలోకి తెస్తున్న బీజేపీ దుష్ట విధానాలపై సిపిఎం పోరాడుతుందని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు .అందుకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన బెదరకుండా బీజేపీపై పోరాడుతున్న రాష్ట్ర సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలుపు తున్నట్లు చెప్పారు . బీజేపీ మతోన్మాద ,విచ్చిన్నకర విధానాలను నిరసిస్తూ సిపిఎం చేపట్టిన ప్రజాచెతన్య యాత్ర ఖమ్మం జిల్లాలో పార్టీటిస్తున్న సందర్భంగా వైరా పట్టణంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు . కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్పొరేట్ల కు ఊడిగం చేస్తూ పేదలపై బారాలు వేయడంపై విమర్శలు గుప్పించారు .బీజేపీ కేవలం మతం కులం ,ప్రాంతం పేర్లతో దేశంలో మతకల్లోలాలు ,ప్రాంతీయ తత్వాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటుందని మండిపడ్డారు . దేశంలో అదానీ ,అంబానీ ఆస్తులు పెరుగుతుండగా పొద్దుస్తమానం కష్టపడే రైతులు ,కూలీల పరిస్థితి దిగజారుతుందని ,గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇదేనా బీజేపీ విధానమని ప్రశ్నించారు .నిత్యావసర ధరలు పెరుగున్నాయని , పెట్రోల్ ,డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని , పేదలు తిండి లేక ఇబ్బందులు పడుతుంటే ,కొందరు విపరీతంగా అప్పులు చేసి దేశం నుంచి పారిపోయాడు మోడీ ప్రభుత్వం అవకాశం ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు. ఒకే దేశం ,ఒకే భాష , ఒకే మతం ,ఒకే ఎన్నిక, ఒకే పన్ను అంటున్న మోడీ ఒకే కులమని ఎందుకు అనడంలేదని బీజేపీ విధానాలను తమ్మినేని తూర్పార పట్టారు .

ఎన్నికల్లో బీఆర్ యస్ తోనే ప్రయాణం …

బీజేపీ వ్యతిరేకంగా నిఖార్సగా నిలబడి ఎన్ని వత్తుడులు పెట్టిన నిలబడి కలబడుతున్న కేసీఆర్ కు హ్యాట్సాఫ్ చెపుతున్నట్లు తమ్మినేని తెలిపారు . ఎన్నికల్లో బీఆర్ యస్ తో కల్సి ప్రయాణం చేయాలనీ లెఫ్ట్ పార్టీలు నిర్ణయించుకున్న విషయాన్నీ గుర్తు చేశారు . అయితే ఇంతవరకు సీట్ల విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదని సమయం వచ్చినప్పుడు కేసీఆర్ తో మాట్లాడి సీట్లు పోటీల విషయం నిర్ణయిస్తామని తెలిపారు . సిపిఎం, సిపిఐ పార్టీలు ఒకరు పోటీచేసే దగ్గర మరొకరు పోటీచేయకుండా , ఒకరు కోరే సీటు మరొకరు కోరకుండా ఉండాలని ఇటీవల జరిగిన రెండు పార్టీల జాయింట్ సమావేశంలో నిర్ణయించుకున్నట్లు తెలిపారు . తాము చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని బీజేపీ విధానాలపై ప్రజలు మండిపడుతున్నారని పేర్కోంనారు .

జంక్షన్ లోనిలుచున్న వ్యక్తి బీజేపీకి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవద్దు …తమ్మినేని సలహా

జిల్లాకు చెందిన ప్రముఖ వ్యక్తి జంక్షన్ లో నిలుచొని బీజేపీ వైపు తొంగిచూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, బీజేపీకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవద్దని తమ్మినేని పరోక్షంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సలహా ఇచ్చారు .

 

Related posts

రాజ్యసభ ఎన్నికల్లో మహారాష్ట్ర లో బీజేపీ , రాజస్థాన్ లో కాంగ్రెస్ దే హావా!

Drukpadam

మేము జైలుకు వెళ్లేందుకు సిద్ధం … జగన్ తగ గొయ్యి తానే తవ్వు కుంటున్నారు : కేశినేని ,గద్దె !

Drukpadam

దారి కోసం వెతుకులాటా? తనపై వచ్చిన ఆరోపణలపై వివరణా?ఈటల రాజకీయ నేతలను కలవడం పై పెరుగుతున్న ఆశక్తి

Drukpadam

Leave a Comment