Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీ అనర్హత వేటుపై దద్దరిల్లిన పార్లమెంట్

రాహుల్ గాంధీ అనర్హత వేటుపై దద్దరిల్లిన పార్లమెంట్

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ నల్లచొక్కాలు ధరించిన విపక్షాలు

నిమిషంలోనే పార్లమెంటు ఉభయ సభలు వాయిదా

అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని,రాహూల్ గాంధీపై అనర్హత వేటును ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్

పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు విపక్షాల మార్చ్

గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు బీఆర్ఎస్, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ,ఆప్,ఎస్పీలు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే,బాలు, కేశవరావు, నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, దామోదర్ రావులతో కలిసి ఆందోళనకు దిగారు
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ,అదానీ వ్యవహారంపై జేపీసీ నియమించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంటు దద్దరిల్లింది, స్తంభించిపోయింది.విపక్షాలు నల్లచొక్కాలు, కండువాలు ధరించి నిరసనకు దిగడంతో ఉభయ సభలు ప్రారంభమైన నిమిషంలోనే అధికార పక్షం గత్యంతరం లేక వాయిదా వేయాల్సి వచ్చింది.దీంతో, బీఆర్ఎస్, కాంగ్రెసు, డీఎంకే, టీఎంసీ,ఆప్,ఎస్పీ, డీఎండీకే తదితర పక్షాల సభ్యులు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ,ప్రధాని మోడీ నియంతృత్వ విధానాలను ఎండగడుతూ పార్లమెంటు నుంచి పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ విజయ్ చౌక్ వరకు మార్చ్ జరిపారు.పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద “సత్యమేవ జయతే” అనే బ్యానరును ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్),కే.కేశవరావు,నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి (బీఆర్ఎస్),బాలు (డీఎంకే)లు మాట్లాడుతూ, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది మండిపడ్డారు.ఈ ఆందోళనలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, జైరాం రమేష్, జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు,పీ.రాములు, బడుగుల లింగయ్య యాదవ్,మన్నె శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్, బోర్లకుంట వెంకటేష్ నేతకాని తదితర ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.

Related posts

భారీ వర్షాలపై కేసీఆర్.. సిరిసిల్ల వర్ష బీభత్సంపై కేటీఆర్ సమీక్షలు!

Drukpadam

కార్పొరేట్ ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సమస్యను వివరించిన సత్య నాదెళ్ల..

Drukpadam

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై ఎందుకు దాడి జ‌ర‌గ‌లేదు?: మంత్రి విశ్వ‌రూప్‌

Drukpadam

Leave a Comment