Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల కలకలం!

తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల కలకలం!
భైంసాలో మూడు కేసులు
ఒకరి మరణం, మరో ఇద్దరి పరిస్థితి విషమం
గాంధీలోనూ మూడు కేసులు
కొవిడ్‌ సోకిన అందరికీ బ్లాక్ ఫంగస్‌ రాదు
వెల్లడించిన డీఎంఈ రమేశ్‌ రెడ్డి
ఇప్పటికే కరోనా తో వణికి పోతున్న ప్రజలకు బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి మరింత ప్రజలను భయాందోనళకు గురిచేస్తున్నది . దేశంలో వివిధ ప్రాంతాలలో ఇలాంటి కేసులు ఉన్నాయని వార్తులు వస్తున్నా పెద్ద విషయం కాదని డాక్టర్లు కొట్టిపారేశారు.కానీ దీని భారిన పడిన వారు కొందరు చనిపోయారని ,నిర్దారణ అయిందని వార్తల నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టి సారించింది.కరోనా వచ్చిన వారికీ బ్లాక్ ఫంగస్ రాదని వైద్యాధికారులు చెపుతున్నప్పటికీ ప్రజల్లో నెలకొన్న అందోళనలు తీరడంలేదు
ప్రత్యేకించి తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్‌ జిల్లాలోని భైంసాలో ముగ్గురు ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో ఒకరు చనిపోయారు. దీంతో ఆ జిల్లాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.

ఈ విషయంపై తెలంగాణ వైద్య విద్య విభాగం డైరెక్టర్‌ రమేశ్‌ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్‌ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులు ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి వచ్చాయన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసులను ప్రైవేటు ఆసుపత్రుల వారు గాంధీకి పంపేందుకు యోచిస్తున్నారని తెలిపారు. కొవిడ్‌ సోకిన ప్రతిఒక్కరికీ బ్లాక్‌ ఫంగస్‌ సోకదని స్పష్టం చేశారు. కొందరు మాత్రమే ఈ వ్యాధి బారిన పడతారన్నారు.

Related posts

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు…

Drukpadam

కరోనా దెబ్బకి చైనాలో అతిపెద్ద షాపింగ్ మహల్ మూసివేత …

Drukpadam

లాక్ డౌన్ పొడిగింపుపై ఈ నెల 20న క్యాబినెట్ నిర్ణయిస్తుంది: కేటీఆర్…

Drukpadam

Leave a Comment