Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

ప్రతిపక్షాల లేఖ పై బీజేపీ మండిపాటు…

ప్రతిపక్షాల లేఖ పై బీజేపీ మండిపాటు…
-అబద్దాలు ప్రచారం చేయడం తగదని హితవు
-వాస్తవాలు ఇవిగో అంటూ పేపర్ విడుదల
-సోషల్ మీడియా లో బీజేపీ వాస్తవాల పేపర్ చెక్కర్లు
-ప్రధాని మోడీ సెకండ్ వేవ్ పై రాష్ట్రాలను అప్రమత్తం చేశారు
-మార్చ్ 17 ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో సెకండ్ వేవ్ పై అలర్ట్ చేశారు
-వ్యాక్సిన్ ఉత్పత్తి సరిగా లేకనే నిదానంగా జరుగుతుంది.
-స్పీడ్ పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నాం
-సెంట్రల్ విస్టా పై లేని పోనీ ఆరోపణలు -అది రెండు మూడు సంవత్సరాల ప్రాజక్టు
-దాని బడ్జెట్ రూ 20 వేల కోట్లు -కరోనా కోసం 2021 -22 కేటాయించింది 35 కోట్లు
-న్యూజీలాండ్ తో పోల్చడము దారుణం -అది మన బెంగుళూరు అంత దేశమే
-మనం యూరప్ ఖండంతో పాటు నార్త్ కొరియా అంత జనాభా కలిగి ఉన్నాం
దేశంలో కరోనా విజృంభణ ,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై దేశంలోని 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశాయి. బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజక్టు ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. దానికి పెడుతున్న ఖర్చు కరోనా కోసం పెడితే బాగుంటుందని సలహా ఇచ్చాయి. కరోనా కట్టడిలో కేంద్రం పూర్తీ నిర్లక్ష్యం తో వ్యవహరించిందని దుమ్మెత్తి పోశాయి.దీనిపై బీజేపీ మండిపడింది. ప్రతిపక్షాలు
చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్ని అభూత కల్పనలు అసత్యాలు అని కొట్టి పారేసింది.కరోనా సెకండ్ వేవ్ ను గుర్తించలేదని , పట్టించుకోలేదని చెప్పడం పూర్తీ నిరాధారమైన ఆరోపణ అని తీవ్రంగా ఖండించింది.సెకండ్ వేవ్ గురించి ప్రధాని 2020 మార్చ్ 17 న ముఖ్యమంత్రిలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో హెచ్చరించారని పేర్కొన్నది . వ్యాక్సిన్ కొరత ఉన్నమాట నిజమే నాని ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి వివరించింది.రాష్ట్రాల కు రాష్ట్రాలకు మధ్య వ్యాక్సిన్ ధరల విషయంలో వ్యత్యాసాన్ని తప్పుపట్టడం సరికాదని అన్నది.అంతే కాకుండా వ్యాక్సిన్ కోసం ఫార్మా కంపెనీ లతో మాట్లాడుతూ వాటి సామర్ధ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టిన విషయాన్నీ విస్మరించటాన్ని తప్పు పట్టింది.అసత్యాలు ప్రచారం చేయడం తగదని ప్రతిపక్షాలకు హితవు పలికింది. కరోనా కోసం 2021 -22 సంవత్సరం బడ్జెట్ లో రూ 35 వేల కోట్ల ను కేటాయించిన విషయాన్నీ తెలియజేసింది. అదే విధంగా బడ్జెట్ లో వైద్యరంగానికి 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయించని విషయాన్నీ ప్రస్తావించింది. కరోనా కట్టడిలో న్యూజీలాండ్ ను ఆదర్శముగా తీసుకోవాలని ప్రతిపక్షాలు సూచించటాన్ని ఎద్దవా చేసింది. న్యూజిలాండ్ దేశం మన బెంగుళూరు అంత జనాభా లేదని ,మనదేశ జనాభా యూరప్ ఖండంతో పాటు ఉత్తర కొరియా ను కలిపితే ఎంత జనాభా ఉంటుందో అంత ఉందని పేర్కొన్నది. అందువల్ల పోలిక వాస్తవానికి దగ్గరగా ఉండాలని తెలిపింది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వాటవాలను దాచిపెట్టి తప్పుడు ప్రచారమా చేయటం మానుకోవాలని హితవు పలికింది. బీజేపీ వస్తా పత్రాన్ని ఆ పార్టీ సోషల్ మీడియా టీమ్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది.

Related posts

ఖమ్మం లో కాంగ్రెస్ కు ఝలక్ ఇవ్వనున్న ఇద్దరు కార్పొరేటర్లు!

Drukpadam

రాజ‌కీయాలు చేసే ఏ గ‌వ‌ర్న‌ర్ అయినా ప‌నికిమాలిన గ‌వ‌ర్న‌రే: సీపీఐ నారాయ‌ణ‌!

Drukpadam

జ‌గ‌న్‌కూ లేఖ రాసిన దీదీ… భేటీ ముగిశాక బ‌య‌టకొచ్చిన ఆహ్వానం!

Drukpadam

Leave a Comment