Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భద్రాచలం సీతారాముల కల్యాణంలో చిన్నజియ్యర్ సోత్కర్ష…!

భద్రాచలం సీతారాముల కల్యాణంలో చిన్నజియ్యర్ సోత్కర్ష…!
అభిజిత్ లగ్నం ప్రకారం జరరాల్సిన పెళ్లి ఆలస్యం
రామదాసు కీర్తనలకు లభించని చోటు
స్థానిక అర్చకస్వాముల నుంచి పెళ్ళిక్రతువు హైజాక్ చేస్తున్న వైనం

ప్రపంచవ్యాపితంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండి దక్షణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల రాములోరి కళ్యాణం మసకబారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక అర్చక స్వాములు అభిజిత్ లగ్నప్రకారం చేయాల్సిన పెళ్లి చిన్నజియ్యర్ స్వామి సోత్కర్ష తో కొంత ఆలస్యం అయిందనే విమర్శలు ఉన్నాయి.

వందల సంవత్సరాల చరిత్రకలిగిన దేవాలయం పవిత్ర గోదావరి నదిఒడ్డున ఉండటంతో భక్తులకు కనుల విందు చేస్తుంది. రామనామ స్మరణతో భద్రాచలం మారుమోగుతోందిరెండు తెలుగు రాష్ట్రాలనుంచి కాకుండా ఛత్తీస్ ఘడ్ , మహారాష్ట్రలనుంచి లక్షలాదిగా భక్తులు వస్తుంటారు . ఇక్కడ రాముడు నడియాడాడని ప్రజల నమ్మకంఅందువల్లనే తానీషా కొలువులో భద్రాచల ప్రాంత రెవెన్యూ అధికారిగా పనిచేసిన కంచర్ల గోపన్న అలియాస్ భక్త రామదాస్ ప్రజలనుంచి వసూల్ చేసిన పన్ను తో భద్రాచలంలో గుడి కట్టించారు . తర్వాత ఆయన పడ్డ కష్టాలు జైలు జీవితం తెలిసిందే . రామ లక్షణులు స్వయంగా వచ్చి తానీషాకు కట్టాల్సిన ఆరు వేల రొక్కలు కట్టి రామదాసును జైలు నుంచి విడిపించిన చరిత్రను ప్రజలు కథలు ,కథలుగా చెప్పుకుంటారు . జైల్లో ఉండగానే రామదాసు ( రాముడి భక్తుడు ,సేవకుడు ) రాముడిపై అనేక కీర్తనలు రాశారు . కీర్తనలు ఆలయంలో శిలాఫలకాలపై చెక్కబడి ఉన్నాయి. రాముడికి సీతమ్మకు రామదాసు అనేక ఆభరణాలు చేయించారు . వాటిపై కూడా కీర్తనలు ఉన్నాయి. “సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకం రామచంద్రాఅంటూ దీనంగా పడిన కీర్తనమీకు ఇన్ని చేయించినా తన కష్టాలు పట్టించుకోకుండాఎవడబ్బ సొమ్మని కులుకుతున్నావు రామచంద్రా” …! అంటూ రాముడిని సైతం నిలదీసిన పద్యం ప్రజల హృదయాలను తాకింది

సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణమని ప్రతీతిదేశమంతా వాడవాడలా ఎంతో వైభవోపేతంగా జరుపుకునే క్రతువు … “శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండిఅంటూ సినీ పాట పల్లె నుండి పట్టణాలవరకు మారుమ్రోగుతుంది . ఇది భక్తులను పరవశింపజేస్తుంది. ప్రత్యేకించి భద్రాచలంలో స్థానిక కట్టుబాట్లు , గోత్ర నామాలతో సంప్రదాయబద్ధంగా జరుపుతున్న కళ్యాణంకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ సీతమ్మకు మాంగళ్య ధారణలో మూడు సూత్రాలు ఉంటాయి. వీటిని గురించి కూడా అర్చక స్వాములు వివరిస్తున్న తీరు సామాన్యలుకు సైతం అర్థం అయ్యేలా ఉంటుంది. స్థానిక సంప్రదాయాలను పక్కనబెట్టి స్వాములోరి కళ్యాణం చేయడం తగదని అభిప్రాయాలు ఉన్నాయి.

ఇప్పుడు టీవీ లు చానళ్ళు వచ్చిన తర్వాత ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నాం .కానీ ఇదివరకు రేడియో లలో భద్రాచలం నుంచి శ్రీసీతారాముల కళ్యాణం రోజున ఆకాశవాణి వారు చేసే ప్రసారాలు , ఉషశ్రీ , మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి వారి మధుర వ్యాఖ్యానాలు ప్రజలను కట్టి పడేసివిమద్యమద్యలో రామదాసు రాసిన కీర్తనలుఆలపించేవారు . ఇది భద్రాచలంలో ఉండి వింటున్నట్లుగా ఉండేది . కానీ నేడు ఎక్కడో కల్యాణ క్రతువు పట్టు తప్పుతుంది. ఎంతో విశిష్టత కల్గిన భద్రాచలం పేరు ప్రఖ్యాతులు మసక బారుతున్నాయా …?అనే సందేహాలు కలుగుతున్నాయి. భద్రాచలం అభివృద్ధితోపాటు పట్టుతప్పుతున్న కట్టుబాట్లను సరిదిద్దాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి….

Related posts

ఒమిక్రాన్ ఎఫెక్ట్ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…

Drukpadam

జీఎస్టీ సమావేశంలో భట్టి

Ram Narayana

భారత్ లో పెట్రోధరలు మరింత పైపైకి …అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు…

Drukpadam

Leave a Comment