Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

‘శకుంతల’ పాత్రకి ముందుగా సమంతను అనుకోలేదు: గుణశేఖర్

శకుంతల’ పాత్రకి ముందుగా సమంతను అనుకోలేదు: గుణశేఖర్

  • ‘శాకుంతలం’ ప్రమోషన్స్ లో గుణశేఖర్ 
  • ఈ సినిమా కోసం మూడేళ్లు పట్టిందన్న డైరెక్టర్ 
  • 81 వర్కింగ్ డేస్ లో షూటింగు పూర్తిచేశామని వెల్లడి 
  • తన కూతురే సమంత పేరును ప్రస్తావించిందని వ్యాఖ్య 
  • ఏప్రిల్ 14న విడుదల కానున్న సినిమా 

గుణశేఖర్ ఏ కథను ఎంచుకున్నప్పటికీ, ఆ కథను చకచకా చుట్టేసే ప్రయత్నమైతే చేయరు. ఆ కథపై .. ప్రధానమైన పాత్రలపై ఒక రేంజ్ లో ఆయన కసరత్తు చేస్తారు. అలాంటి ఆయన నుంచి ‘శాకుంతలం’ రానుంది. గుణశేఖర్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాను, ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో గుణశేఖర్ మాట్లాడుతూ .. “ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఒక ఏడాది పాటు నడిచాయి. షూటింగుకి ఒక 6 నెలల సమయాన్ని అనుకుని 81 వర్కింగ్ డేస్ లో పూర్తిచేశాము. ఆ తరువాత ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశాము. అలా ఈ సినిమాను సిద్ధం చేయడానికి మూడేళ్లు పట్టింది” అన్నారు.

“శకుంతలను కాళిదాసు ఎలా వర్ణించారనేది నేను చదివాను. అందువలన ఆ పాత్రకి ఎవరైతే బాగుంటారా అని ఆలోచన చేస్తున్నాను. సమంతను నేను అనుకోలేదు. ఆమె అయితే బాగుంటుందని  మా అమ్మాయి చెప్పింది.  అప్పుడు నేను మరోసారి ‘రంగస్థలం’ చూశాను. ఒక పాత్రలో సమంత ఎంతగా ఒదిగిపోతుందనేది నాకు అర్థమైంది. అప్పుడు ఆమెను సంప్రదించడం జరిగింది” అని చెప్పుకొచ్చారు.

Related posts

శివశంకర్ మాస్టర్ కుటుంబానికి చిరంజీవి రూ.3 లక్షల ఆర్థికసాయం!

Drukpadam

రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను పవన్ కళ్యాణ్ మిస్ లీడ్ చేశాడా ?

Drukpadam

సమాజ్ వాదీ పార్టీ నేత ఇంట్లో నోట్ల గుట్టలు.. లెక్కిస్తే రూ.150కోట్లకు పైనే.. షాకైన అధికారులు!

Drukpadam

Leave a Comment