Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు బలహీనంగా ఉంటాయి. పొరపాటున కూడా వాటి వైపు వెళ్లొద్దు:

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు బలహీనంగా ఉంటాయి. పొరపాటున కూడా వాటి వైపు వెళ్లొద్దు: టీఎస్ రెడ్కో ఛైర్మన్ వై. సతీశ్ రెడ్డి

  • వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
  • ఆ రైళ్ల దగ్గరకు వెళ్లొద్దని బర్రెలకు విన్నవించిన సతీశ్ రెడ్డి
  • మీరు రైళ్లని తాకితే అవి దెబ్బతింటాయని ఎద్దేవా

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సికింద్రాబాద్ – తిరుపతి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీఎస్ రెడ్కో ఛైర్మన్ వై. సతీశ్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వందేభారత్ రైళ్లకు దగ్గరగా వెళ్లొద్దని బర్రెలకు విన్నవించారు.

వందేభారత్ రైలును మోదీ ఈరోజు ప్రారంభిస్తున్నారని… ఆ రైళ్లు చాలా బలహీనంగా ఉంటాయని చెప్పారు. మీరు ఆ రైళ్ల వైపు పొరపాటున కూడా వెళ్లొద్దని… మీరు పొరపాటున ఆ రైళ్లను తాకితే అవి దెబ్బతింటాయని చెప్పారు. ఆవులు, బర్రెలు తగిలితే చిద్రమైపోయే రైళ్లను మోదీ తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. మన దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడతానని చెప్పిన మోదీ వందేభారత్ రైళ్లను తీసుకొచ్చారని విమర్శించారు. ఆ రైళ్లను ప్రవేశ పెట్టకుండా మోదీని ఎలాగూ ఆపలేమని… అందుకే, మీరే ఆ రైళ్ల వైపు వెళ్లవద్దని బర్రెలకు చెప్పారు. వందేభారత్ రైళ్లు వెళ్లే ట్రాక్ వద్దకు వెళ్లొద్దని అన్నారు.

Related posts

గంజాయి సాగును అనుమతిద్దామా..?: పరిశీలిస్తున్న హిమాచల్ ప్రదేశ్!

Drukpadam

యూరో కప్ ఫైనల్‌లో ఇటలీ పై ఓడిన ఇంగ్లండ్

Drukpadam

తెలంగాణ నేత‌న్న‌ల‌కు దేశంలోనే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు : మంత్రి కేటీఆర్!

Drukpadam

Leave a Comment