Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణలో అవినీతి ,కుటుంబపాలన పై ప్రధాని మోడీ నిప్పులు…

తెలంగాణలో అవినీతి ,కుటుంబపాలన పై ప్రధాని మోడీ నిప్పులు…
-కుటుంబ పాలన తెలంగాణలో అవినీతిని పెంచి పోషిస్తోందని విమర్శ 
-కుటుంబ పాలనకు చరమగీతం పలుకుదామని పిలుపు 
-కుటుంబ పాలన ఉన్నచోట అవినీతి మొదలవుతుందన్న ప్రధాని 
-కేసీఆర్ పాలనపై విమర్శల వర్షం …
-అవినీతి పరులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని మోదీ హెచ్చరిక
-కేంద్ర పథకాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్న మోదీ 
-తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమయిందని వ్యాఖ్య 

తెలంగాణాలో అవినీతి ,కుటుంబపాలనపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు . కేసీఆర్ పేరు ప్రస్తావించకుండానే కుటుంబపాలన వల్ల పెరిగిన అవినీతి ,రాష్ట్రానికి జరుగుతున్ననష్టాలపై మండిపడ్డారు . మీకు అవినీతి పాలనా కావాలా ..? కుటుంబపాలన కావాలా అంటూ సభికుల చేత వద్దు వద్దు అంటూ అనిపించారు . సికింద్రాబాద్ టు తిరుపతి వందేభారత్ ట్రైన్ ప్రారంభంతోపాటు ఇతర అభివృద్ధి కార్యకార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చేందుకు హైద్రాబాద్ వచ్చిన ప్రధాని మోడీ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు .

తెలంగాణ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని… అయితే, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు దూరమవుతున్నాయని విమర్శించారు. కుటుంబ పాలన ఉంటే ఇలాగే జరుగుతుందని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులో తమ వారి స్వార్థాన్ని ఇక్కడి పాలకులు చూస్తున్నారంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, రాష్ట్ర అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని, అందుకు అభివృద్ధిలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన, ఆ కుటుంబ అవినీతి పెరిగిపోతోందని అన్నారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు. అవినీతిని అణచివేస్తున్న తనపై పోరాడటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయని చెప్పారు.

తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపరులపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాయతీగా పని చేసేవారు ఈ కుటుంబ పాలకులకు నచ్చడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఉన్న కుటుంబ పాలన అన్ని వ్యవస్థలు తన గుప్పిట్లో ఉండాలని భావిస్తోందని మండిపడ్డారు. అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఎక్కడైతే కుటుంబ పాలన ఉంటుందో అక్కడ అవినీతి మొదలవుతుందని చెప్పారు. విచారణ సంస్థలను కూడా బెదిరించే స్థాయికి కుటుంబ పాలకులు వచ్చారని మండిపడ్డారు. కుటుంబ పాలనకు చరమగీతం పలుకుదామని పిలుపునిచ్చారు.

ఈ సభలో రాష్ట్ర గవర్నర్ తమిళశై , కేంద్ర రైల్వే మంత్రులు బిష్ణుయ్ , కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు …

భాగ్యలక్ష్మి నగరాన్ని వేంకటేశ్వర స్వామి నగరంతో కలిపాం: మోదీ

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రియమైన సోదర, సోదరీమణులారా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో మాట్లాడుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తెలుగు రాష్ట్రాలపైన తెలంగాణ, ఏపీలను కలుపుతూ ఈరోజు సికింద్రాబాద్ – తిరుపతిని కలుపుతూ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించామని చెప్పారు. భాగ్యలక్ష్మి నగరాన్ని ( హైదరాబాద్) వేంకటేశ్వరస్వామి నగరంతో కలిపామని తెలిపారు. రెండు రాష్ట్రాలను కలుపుతూ మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించామని చెప్పారు. 

తెలంగాణలో రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించామని మోదీ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామి అయ్యేలా చూశామని తెలిపారు. రాష్ట్రంలో రైల్వే డబ్లింగ్ లు, విద్యుదీకరణ పనులను పూర్తి చేశామని చెప్పారు.  జాతీయ రహదారులను పూర్తి చేశామని చెప్పారు. గత 9 ఏళ్లలో 70 కిలోమీటర్ల మెట్రో నెట్ వర్క్ ను నిర్మించామని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి చేయడం తనకు లభించిన అదృష్టమని చెప్పారు. రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించామని తెలిపారు.

Related posts

టీఆర్ యస్ వ్యతిరేక ప్లాట్ ఫారం కోసం ప్రయత్నాలు :కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Drukpadam

రాజశేఖరరెడ్డి నరరూప రాక్షసుడు.. జగన్ ఊసరవెల్లి: టీఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు…

Drukpadam

ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌.. విష‌యం ఏమిటంటే..!

Drukpadam

Leave a Comment