Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

నామ అంటే ఒక బ్రాండ్ …నామ అంటే విలులతో కూడుకున్న రాజకీయం చేసేవాడు …

నామ అంటే ఒక బ్రాండ్ …నామ అంటే నీతి నిజాయితీలు కలవాడు ..విలువలతో కూడిన రాజకీయాలు చేసేవాడు …అనేక సందర్భాల్లో పార్టీ మారాలనే వత్తిడి వచ్చిన తనను నమ్మిన పార్టీని వదులుకోలేదు …పదవులు ఉంటాయి ,పోతాయి…మాటమీద నిలబడటమే నికార్సైన రాజకీయం …ఇది నేడు కొరవడింది …రాజకీయాలు అంటే విరక్తి కలిగేలా ఉన్నాయి…విలువలకు పాతరేస్తున్నారు …గతంలో సర్పంచ్ కూడా పార్టీ మారాలంటే ససేమీరా ఒప్పుకునే వాడు కాదు …నేడు మంత్రులు ,ఎంపీలు ,ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు పార్టీ మారడం నిత్యకృత్యమైంది …అవకాశవాద రాజకీయాలకు తెరలేచింది … నన్ను కూడా కొంతమంది ప్రశ్నిస్తారు టీడీపీ నుంచి ఎందుకు మారారని … నేను టీడీపీ నుంచి బయటకు వచ్చేటప్పుడు చంద్రబాబుతో గంటన్నర భేటీ అయ్యాను …తెలంగాణ రాజకీయాల్లో టీడీపీని నడిపించడం ఆయనకు ఇష్టం లేదనే అభిప్రాయంతోనే బయటకు వచ్చాను … పార్టీలు వేరైనా ఇప్పటికి చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి , కేసీఆర్ లమీద గౌరవం దగ్గలేదు …వారు లెజెండ్స్ … లోకసభ ఎన్నికల్లో బీఆర్ యస్ నుంచి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నామ నాగేశ్వరరావు ను “దృక్పధం ” పలకరించగా ఆయన మనసులోని మాటలను పంచుకున్నారు …

నేను రైతు బిడ్డను …ఖమ్మం జిల్లాలోనే పుట్టాను …ఇక్కడే పాఠశాల , కొత్తగూడెంలో ఇంటర్ , డిగ్రీ చదివాను …జిల్లా ప్రజలకు సేవచేసే భాగ్యం ఎంపీగా నాకు కలిగింది … రెండు టర్మ్ లు ఎంపీగా ప్రజలు నాకు అవకాశం కల్పించారు …వారికీ కృతజ్ఞడను …పార్లమెంట్ లో ప్రజల గొంతుకగా నిలిచాను …నామ అంటే ప్రజల సమస్యలు లేవనెత్తేవాడని తోటి సభ్యులు సైతం ప్రశంసించే విధంగా నడుచు కున్నాను … ఇది జీవితంలో నాకు ఎంతో సంతృప్తినిచ్చింది …

అనేక మాయమాటలు , అమలు కానీ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కొద్దీ నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంది … ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది … అది తమ ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తుంది … నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలే ఎందుకు గెలిపించామా …? అని భాదపడుతున్నారు …కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలుకు ఇచ్చిన అనేక వాగ్దానాలను విస్మరించిందని ,మాట నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిందని అందువల్ల కాంగ్రెస్ కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నామ అన్నారు …ఎన్నికల్లో చెప్పిన మాటలను విస్మరించిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నామ హెచ్చరించారు … తమ ప్రచారంలో ఎక్కడకు వెళ్లిన ప్రజలు చూపిస్తున్న ఆదరణ తమకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుందన్నారు … గతంలోకన్న ఎక్కువ మెజార్టీ తో గెలుస్తానని నామ ధీమా వ్యక్తం చేశారు …

ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు … ఇక్కడే కాదు రాష్టంలో కూడా రైతులను ఆదుకోలేదని అందువల్ల రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రవ్యతిరేకత వ్యక్తం అవుతుందని అన్నారు …ఎన్నికల్లో రైతు బందు ఎకరాకు 15 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ …. తమ ప్రభుత్వం ఇచ్చిన 10 వేల రూపాయలు కూడా ఇవ్వలేకపోయిందన్నారు … ఇది రైతులను మోసం చేయడంకాక మరేమిటని నిలదీశారు …

కల్యాణ లక్ష్మి పథకానికి లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తాన్నారు …పెన్షన్ 4 వేలు ఇస్తామన్నారు …రైతులకు 2 లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన మరు క్షణమే చేస్తామని వాగ్దానం చేశారు …ప్రతి మహిళకు నెలకు రూ 2500 రూపాయలు ఇస్తామన్నారు …ఆవిధంగా 420 వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నట్టేట ముంచిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని నామ పేర్కొన్నారు …

జిల్లా అభివృద్ధికి 10 వేల కోట్ల కేంద్ర నిధులు ….

జిల్లాలో 10 వేలకోట్ల రూపాయల కేంద్ర నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించానని పేర్కొన్నారు …360 నుంచి 400 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరి చేయించిన ఘనత తనదే అన్నారు …పీఎం సడక్ యోజన ద్వారా అనేక రోడ్లు వేయించామని తెలిపారు …ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ , కొత్తగూడెం- కొవ్వూరు రైల్వే లైన్ సత్తుపల్లి వరకు వేయించామని అన్నారు …సూర్యాపేట -ఖమ్మం రోడ్ పూర్తీ అయిందని మిగతా జాతీయ రహదార్లు శరవేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు …కోదాడ -ఖమ్మం రోడ్ కూడా పూర్తీ కావచ్చిందని అన్నారు …ఇవి కాక నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా అనేక మందికి , బడులు,గుడులకు సహాయం అందించామని ఇన్ని కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న తమకు ఖమ్మం ప్రజలపై నమ్మకం ఉందని ఖమ్మం లోకసభ సీటు తప్పకుండ గెలిచి తీరుతామని నామ విశ్వాసం వ్యక్తం చేశారు …

Related posts

మున్నేరుకు కరకట్ట కాంగ్రెస్ తో నే సాధ్యం …కాంగ్రెస్ రాష్ట్ర నేత పొంగులేటి .

Ram Narayana

కొత్తగూడెం సింగరేణి కార్మికవాడల్లో నామ విస్తృత ప్రచారం …

Ram Narayana

పాలేరు ప్రజలకే నాజీవితం అంకితం : ఎమ్మెల్యే కందాళ..

Ram Narayana

Leave a Comment