Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నేనున్నానని …మీకేం కాదని…! చీమలపాడు భాదితులకు పొంగులేటి భరోసా!

నేనున్నానని …మీకేం కాదని…! చీమలపాడు భాదితులకు పొంగులేటి భరోసా!
– చీమలపాడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు పొంగులేటి మనోధైర్యం
– అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ
– తక్షణ సాయంగా బాధిత ఐదు కుటుంబాలకు రూ.25 వేలు చొప్పున ఆర్థికసాయం

నిన్న జరిగిన బాణాసంచా పేల్చినా ఘటనలో భాదిత కుటుంబాలకు మాజీ ఎంపీ పొంగులేటి నేనున్నానని భరోసా ఇచ్చారు … ఖమ్మంజిల్లా లోని కారేపల్లి మండలం చీమలపాడు గ్రామానికి చెందిన రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి చెందిన వ్యక్తులు …. దురదృష్టవశాత్తు బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రులయ్యారు…. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ…. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ ఐదుగురు క్షతగాత్రులను గురువారం పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ సమయంలో పొంగులేటిని చూడగానే బాధిత కుటుంబ సభ్యులంతా బోరున విలపించారు. వారి బాధను చూసిన పొంగులేటి కూడా తీవ్ర కన్నీంటి పర్యంతమయ్యారు. వెంటనే వారందరిని అక్కున చేర్చుకున్నారు. నేనున్నానని… మీకేం కాదని… భరోసాను ఇస్తూ తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25వేలు చొప్పున ఆర్థికసాయాన్ని అందించారు. భవిష్యత్తులోనూ అన్ని విధాలుగా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. క్షతగాత్రులంతా వీలైనంత త్వరగా గాయలబారి నుంచి కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థించారు. బాధితులను పరామర్శించిన వారిలో బొర్రా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

Related posts

భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

Drukpadam

మాస్టర్ ప్లాన్ వేసి టమాటా లారీని ఎత్తుకెళ్లారు… దొరికిపోయారు!

Ram Narayana

న్యూస్ ఇన్ బ్రీఫ్ …….

Drukpadam

Leave a Comment