Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చీమలపాడు వెళుతున్న కాంగ్రెస్ నేత రేణుక చౌదరిని అడ్డుకున్న పోలీసులు …కేసు నమోదు ….

చీమలపాడు వెళుతున్న కాంగ్రెస్ నేత రేణుక చౌదరిని అడ్డుకున్న పోలీసులుకేసు నమోదు ….
పోలీసులతో వాగ్వివాదానికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
కేసీఆర్ డౌన్ ,డౌన్ అంటూ నినాదాలు
రెండు గంటలపాటు కామేపల్లి వద్దనే ఉన్న రేణుక చౌదరి

ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో చనిపోయిన , గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం వెళుతున్న కేంద్ర మాజీమంత్రి రేణుక చౌదరిని కామేపల్లి స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు . చీమలపాడు వెళ్లేందుకు ఆమెని అంగీకరించలేదు . దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు . కేసీఆర్ డౌన్ ,డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు . పోలీసులపై అనుచితంగా ప్రవర్తిన్చారంటూ రేణుక చౌదరి తోపాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలపై కామేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు . ఒక భాద్యత కల్గిన పార్టీగా , మాజీ కేంద్ర మంత్రిగా అక్కడకు వెళ్లి భాదిత కుటుంబాలను పరామర్శిస్తానని ఆమె చెప్పినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు . అక్కడ కొంతమంది అంత్యక్రియలు జరుగుతున్నాయని మీరు పొతే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని అందువల్ల వెళ్లవద్దని వారించారు . రెండు గంటల తర్వాత ఆమె అక్కడకు వెళ్లేందుకు అనుమతించారు . అక్కడకు వెళ్లిన ఆమె కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు . భాదిత కుటుంబాలను కలిసి ఓదార్చారు . కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు .

క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి
నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో గ్యాస్ బండ పేలిన దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని క్షత్తగాత్రులకు 50 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీమలపాడు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ప్రజాపంథా ప్రతినిధి బృందం పరామర్శించి ఓదార్చింది. ఈ సందర్బంగా గుమ్మడి మాట్లాడుతూ రాజకీయ కార్యకలాపాల సందర్భంగా హంగు ఆర్భాటాలు ప్రదర్శించి తగిన జాగ్రత్తలు పాటించని కారణంగా ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ప్రభుత్వం విచారణ జరిపించి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులకు మెరుగైన వైద్యానికి అందించాలని డిమాండ్ చేశారు . ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, డివిజన కార్యదర్శి ఆవుల అశోక్ కుమార్, మండల కార్యదర్శి గుమ్మడి సందీప్ సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్, నాయకులు లక్ష్మీనరస్ వడ్డే వెంకటేశ్వర్లు వేములపల్లి వీరన్న కొయ్యల శ్రీను బాలు లక్ష్మీనారాయణ అనసూయ చల్ల రాజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారత్ సమీపంలోని మూడు దీవులను చైనాకు అప్పగించేసిన శ్రీలంక!

Drukpadam

మెగా కృష్ణారెడ్డి కి ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇవ్వడంపై షర్మిల మండిపాటు …!

Drukpadam

కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం… ‘అపోహలు-వాస్తవాలు’ పేరిట ప్రకటన విడుదల!

Drukpadam

Leave a Comment