Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

గోవా టు ముంబై విమానం రద్దు …సిబ్బందితో గొడవకు దిగిన ప్రయాణికులు ..

ఆయన తల పగలగొట్టండి.. గో ఫస్ట్ విమానం రద్దు కావడంతో కోపంతో ఊగిపోయిన ప్రయాణికులు.. !

  • గోవా విమానాశ్రయంలో ఘటన
  • తెల్లవారుజామున 2.10 గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానం
  • రద్దయినట్టు 10 నిమిషాల ముందు సమాచారం

ముంబై వెళ్లాల్సిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం రద్దు కావడంతో గోవా విమానాశ్రయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2.10 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉండగా సరిగ్గా పది నిమిషాల ముందు విమానం రద్దయినట్టు ప్రయాణికులకు అధికారులు సమాచారం అందించారు. దీంతో అప్పటి వరకు విమానం కోసం వేచి చూసిన ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

విమాన సిబ్బందితో వారు గొడవకు దిగారు. విమానాన్ని రద్దు చేసినట్టు 10 నిమిషాల ముందు చెప్పడం ఏంటని నిలదీశారు. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం రద్దు కావడంతో 80 మందికిపైగా ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

అధికారులతో ప్రయాణికులు వాదులాడుతున్న వీడియోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతున్నాయి. ‘ఆయన తల పగలగొట్టండి’ అని గో ఫస్ట్ సిబ్బందిని ఉద్దేశించి ఓ ప్రయాణికుడు అరవడం ఓ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. మరో విమానం ఏర్పాటు చేసేంత వరకు తమకు హోటల్‌ గది ఏర్పాటు చేయాలని మరో ప్రయాణికుడు కోరాడు. కాగా, ఈ గొడవ తర్వాత ఉదయం 6.30 గంటల సమయంలో మరో విమానం ద్వారా ప్రయాణికులను గమ్య స్థానానికి తరలించారు.

Related posts

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల్లో 1644 మంది నేరచరితులు..

Ram Narayana

ఎంపీని పెళ్లాడబోతున్న టీమిండియా క్రికెట‌ర్ రింకూ సింగ్‌?

Ram Narayana

భారత జలాంతర్గామిని ఢీకొట్టిన చేపల వేట నౌక!

Ram Narayana

Leave a Comment