Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అంబేద్కర్ విశ్వమానవుడు … ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయం …సీఎం కేసీఆర్

అంబేద్కర్ విశ్వమానవుడు … ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయం …సీఎం కేసీఆర్
హైద్రాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అంబేద్కర్ మునిమనవడు ప్రకాష్ అంబేద్కర్
దేశవ్యాపితంగా దళితబంద్ అమలు చేస్తామన్న కేసీఆర్
ఆయన ఆలోచనమార్గంలో నడుద్దాం
సమాజంలో మార్పు కోసం అంబేద్కర్ భావజాలం అవసరమన్న ప్రకాశ్ అంబేద్కర్

రాజ్యాంగ నిర్మాత పేద,బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా హైద్రాబాద్ లో ఘనంగా ఆవిష్కరించారు . సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఆవిష్కరించిన ఈ కార్యక్రమానికి అంబెడ్కర్ మునిమనవడు ప్రకాష్ అంబెడ్కర్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు . రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రజలను ప్రధానంగా బడుగు బలహీనవర్గాలను సమీకరించింది. హైద్రాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన నూతన సెక్రటేరిట్ ఏదురుగా నిర్మించిన ఈ విగ్రహం చూపరులను ఆకర్షిచించేవిధంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ అంబేద్కర్ విగ్రహం ఎక్కడ పెట్టలేదు . 143 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేశారు . విగ్రహం ఎత్తు 125 కాగా విగ్రహం కింద భాగం మరో 50 అడుగులు ఉంది. అంటే మొత్తం 175 అడుగుల ఎత్తులలో విగ్రహం కనిపిస్తుంది. ఇక నుంచి హైద్రాబాద్ వచ్చే వారు చార్మినార్ , ఐటెక్ సిటీ ,ట్యాంక్ బ్యాండ్ , బిర్లామందిర్ ,సమతామూర్తి ప్రాంతాలే కాకుండా మానవతామూర్తి అంబేద్కర్ విగ్రహం చూడాల్సిందే అన్నట్లుగా దీన్ని రూపొందించడం విశేషం ..

ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇది విగ్రహం కాదని ఒక విప్లవమని ,ఆయన విశ్వమానవుడని కొనియాడారు . నిరంతరం ఆయన ఆశయాలను గుర్తు తెచ్చుకొనేలా సచివాలయం దగ్గరే విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు . మానవాళికి ఆయనొక ఆశాదీపం …ఆయన అనేక ఆలోచనలు చేశారు . రచనలు చేశారు . అవి ప్రజలను ఆలోచింపచేసేవిగా ఉన్నాయని అన్నారు . అంబేద్కర్ పుట్టిన రోజు సందర్భంగా 51 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి ప్రతి సంవత్సరం దానిద్వారా వచ్చే 3 కోట్ల రూపాయల వడ్డీతో వివిధరంగాల్లో సేవలు చేసినవారికి అవార్డు లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు . దేశంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిసంవత్సరం 25 లక్షల మందికి దళితబంద్ అమలు చేస్తామని అన్నారు . అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి , సాంఘిక సంక్షేమశాఖ మంత్రి ఈశ్వర్ మాట్లాడారు .శాసనమండలి , శాసనసభ స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి , పోచారం శ్రీనివాస్ రెడ్డి , కేసీఆర్ మంత్రి వర్గ సహచరులు ఎంపీలు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు పాల్గొన్నారు .

అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ కు శుభాకాంక్షలు: ప్రకాశ్ అంబేద్కర్
సమాజంలో మార్పు కోసం అంబేద్కర్ భావజాలం అవసరమన్న ప్రకాశ్ అంబేద్కర్
అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళుతున్నారని కితాబు

గణతంత్ర భారత నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగించారు.

అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం అంబేద్కర్ భావజాలం అవసరమని, సమాజంలో మార్పు కోసం సంఘర్షణ తప్పదని ప్రకాశ్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. రూపాయి సమస్యపై 1923లోనే అంబేద్కర్ పరిశోధన పత్రం రాశారని ఆయన వెల్లడించారు. బ్రిటీష్ వాళ్లు భారతదేశాన్ని ఎలా దోచుకుంటున్నారో గ్రహించారని తెలిపారు.

అంబేద్కర్ ఆశయాలు పాటించడమే ఆ మహనీయుడికి సమర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ఆర్థిక దుర్బలత్వంపై పోరాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని, అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళుతున్నారని ప్రకాశ్ అంబేద్కర్ కొనియాడారు. దళితబంధు పథకం రూపొందించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

Related posts

ధాన్యం కొనకపోతే ఆందోళనలు ఉదృతం …ఈనెల 7 న మండల కేంద్రాలలో ధర్నాలు!

Drukpadam

కురుక్షేత్రాన్ని తలపిస్తున్న ఈటల వర్సెస్ గంగుల మాటల యుద్ధం

Drukpadam

బీజేపీలో ఈటెలపై గుస్సా …!

Drukpadam

Leave a Comment