Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికలసంఘం సన్నాహాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికలసంఘం సన్నాహాలు
నితీష్ వ్యాస్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం రాక
స్థానిక ఎన్నికల సంఘం అధికారులతో సమీక్ష
జిల్లా స్థాయి అధికారులకు రెండు రోజుల శిక్షణ
పలు ఆదేశాలు జారీ …

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. శనివారం నితీష్ వ్యాస్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల సభ్యుల బృందం ఢిల్లీ నుంచి హైద్రాబాద్ చేరుకొని స్థానిక ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడంతోపాటు , సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. జిల్లా స్థాయి అధికారులకు రెండు రోజుల శిక్షణ ఇవ్వాలని కోరింది. మొత్తం పోలింగ్ స్టేషన్లు , బ్యాలట్ బాక్స్ లు , ఈవీఎంలు , స్టాంగ్ రూంలు తదితర విషయాలపై ఆరా తీసింది. షడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చే నవంబర్ లో జరగాల్సి ఉంది. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.

Related posts

కేన్సర్ కు ప్రధాన కారకాలు ఇవే.. జాగ్రత్త!

Drukpadam

ఉమ్మడి జిల్లాలో దూకుడు పెంచిన పువ్వాడ …గెలుపు భాద్యత ఆయనదే …!

Drukpadam

బెంగళూరులో ముగిసిన విపక్ష నేతల సమావేశం… రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయం

Drukpadam

Leave a Comment