Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీఎస్ పి ఎస్ సి కేసుతో ఖమ్మానికి లింకులు….

ఖమ్మం.. 11-10-777/2 ఇంట్లో ఎం జరిగింది?

కొనసాగుతున్న పేపర్ లీకేజీ కేసు

లౌకిక్ దంపతులతో సిట్ బృందం రాక

టీఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజీ కేసులో హైదరాబాద్ సిట్ అధికారులు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది . ఖమ్మం నగరానికి కు చెందిన లౌకిక్, సుస్మితా దంపతులు రిమాండ్ అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం సిట్ అధికారులు కస్టడీలో ఉన్నారు. శనివారం వారిద్దరిని ఖమ్మం తీసుకొచ్చారు. రెండు కార్లలో అధికారులు ఇక్కడ చేరుకున్నారు. నగరంలోని రాపర్తి నగరంలో వారి ఇంట్లో(11-10-777/2) సోదాలు చేశారు. టీఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజీ కేసు కీలక సూత్రధారుడు ప్రవీణ్ నుండి తన భార్య కోసం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్ ను లౌకిక్ రూ.6 లక్షలకు పేపర్ కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన పేపర్ ను ఇంకా ఎవరికైన విక్రయించారా అని సిట్ అధికారులు ఇక్కడ విచారణ చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య సుమారు రెండు గంటలుగా భార్య,భర్తలను వారి ఇంటిలో విచారణ చేశారు. ఇంట్లో పలు పత్రాలు పరిశీలించారు. వారు ఎవరి ద్వారా పేపర్ లీకేజీ కేసు ప్రధాన నిందుతుడు ప్రవీణ్ ను సంప్రదించినట్లు ఇక్కడ విచారణ చేసినట్లు సమాచారం . రాజకీయ నేతల , అధికారులు, గతంలో టీఎస్ పి ఎస్ సి తో సంబంధాలు కలిగిన వ్య్వక్తులు, ప్రైవేట్ సంస్థలు తదితర అంశాలపై కీలక సాక్షాలు , డాక్యూమెంట్స్ వంటివి పంచనామా రాసుకున్నట్లు తెలిసింది. లౌకిక్ తల్లిదండ్రులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వచ్చిన అధికారులు ఇక్కడ ఎటువంటి వివరాలు వెల్లడించకుండా రెండు కార్లలో లౌకిక్ దంపతుల తో సహా వెళ్లిపోయారు. కారు లోపల ఉన్న వారు బయటకు కనపడకుండా అద్దాలకు మ్యాట్స్ ఏర్పాటు చేశారు.

Related posts

హోటల్ గదిలో శవమైన ఎంపీ మోహన్ దేల్కర్

Drukpadam

కర్ణాటక కాంగ్రెస్ దే: శరద్ పవార్

Drukpadam

మతాంతర వివాహాలకు అత్యధికులు వ్యతిరేకమే : తాజా సర్వే…

Drukpadam

Leave a Comment