Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హోటల్ గదిలో శవమైన ఎంపీ మోహన్ దేల్కర్

హోటల్ గదిలో శవమై ఎంపీ మోహన్ దేల్కర్ మృతి
దాద్రా నగర్ హవేలీ నుంచి ఏడు పర్యాయాలు ఎంపీగా
ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు
గుజరాతీ భాషలో సూసైడ్ నోట్
దాద్రా అండ్ నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ హోటల్ గదిలో శవమై కనిపించడం సంచలనం సృష్టించింది. ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న సీ గ్రీన్ సౌత్ హోటల్ గదిలో ఆయన విగతజీవుడిగా పడివుండడాన్ని గుర్తించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ గదిలో గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్ లభ్యమైనట్టు తెలుస్తోంది. అందులో ఏముందనేది పోలీసులు ఇంకా బయట పెట్టలేదు
సిల్వస్సా ప్రాంతంలో ఓ వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించిన మోహన్ దేల్కర్ రాజకీయాల్లో విశేష ప్రభావం చూపించారు. మోహన్ దేల్కర్ ఏడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల వేళ కాంగ్రెస్ ను వీడారు. ప్రస్తుతం ఆయన స్వతంత్ర ఎంపీగా ఉన్నారు. గతేడాది దాద్రా నగర్ హవేలిలో స్థానిక ఎన్నికల కోసం జేడీయూతో పొత్తు పెట్టుకున్నారు. 58 ఏళ్ల మోహన్ దేల్కర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Related posts

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు అడగొద్దంటూ పోస్టర్!

Drukpadam

పదవిలో ఉన్నప్పుడు కాదు.. ఇప్పుడే నేను మరింత ప్రమాదకారిని: ఇమ్రాన్ ఖాన్!

Drukpadam

ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ కరీంనగర్ కు బదిలీ – కొత్త కలెక్టర్ గా విపి గౌతమ్…

Drukpadam

Leave a Comment