Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రధాని పాము-కేసీఆర్ తేలు…భట్టి

నాగులవంచ సభలో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి

➡️ ప్రధాని మోదీ ఒక పాములా..
▶️ కేసీఆర్ ఒక తేలులా రైతులను కాటేస్తున్నారు..
▶️ పామును ములుగర్రతో.. తేలును.. చెప్పుతో కొట్టాలి
▶️ ప్రభుత్వాలతో ఇక యుద్ధమే

▪️ నాగులవంచ రైతులతో ముఖాముఖీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక పాములా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఎర్ర తేలులా రైతాంగాన్ని కాటు వేసేందుకు వస్తున్నారని భట్టి విక్రమార్క అత్యంత తీవ్రమైన విమర్శలు చేశారు. రైతులతో ముఖాముఖీలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భటి విక్రమార్క మల్లుతో పాటు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీపీసీసీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు నూతి సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ మందారవు నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర రావు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పాములా కాటేసేందు వస్తున్న కేంద్రప్రభుత్వాన్ని ములుగర్రతో కొట్టి చంపేసే సమయం వచ్చిందని భట్టి చెప్పారు. అదే సమయంలో ఎర్రతేలులా కాటేస్తున్న ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టి చంపాలని భట్టి చెప్పారు. రైతులకు అన్యాయం చేస్తున్న ఈ రెండు ప్రభుత్వాలను అలా కొట్టకపోతే రైతులు, ప్రజలు బతకలేరని భట్టి చెప్పారు.


ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకూ రైతులు ఒక్కటే చెబుతున్నారు.. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలు అమలైనా.. కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినా రైతులు తమ భూములు అమ్ముకుని కూలీలాగానో.. లేకపోతే నగరాల్లో అపార్ట్ మెంట్ల వద్ద వాచ్ మెన్లుగా పనిచేసే పరిస్థితులు వస్తాయని చెప్పారు. ఆత్మ గౌరవంతో బతికిన మేము.. ఈ రెండు చేయలేము కాబట్టి.. ఆత్మహత్య తప్ప మరో మార్గంలేదని రైతులు తనతో చెప్పినట్లు భట్టి మీడియాకు వివరించారు. మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పనిలేదు.. ఉద్యమాలు చేసి.. పోరాటాలు చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకువచ్చి చట్టాలను వెనక్కు తీసుకునే చేద్దామని భట్టి రైతులకు పిలుపునిచ్చారు. మన కొసం ఢిల్లీలో రైతులు ఒక్క అడుగకూడా వెనక్కు వేయకుండా.. రోజుల తరబడి.. పోరాటం చేస్తున్నారని వివరించారు. బీజేపీ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి.. రైతులకు ఉరి తీళ్లు బిగించాలని చూస్తోందని భట్టి ఆగ్రహంగా చెప్పారు.
దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకే రైతులతో ముఖాముఖీ కార్యక్రమం చేస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. అలాగే కేంద్రం తెచ్చిన నల్ల చట్టాల గురించి రైతులకు వివరించేందుకు ఈ కార్యక్రమం అన్నారు. అలాగే కేసీఆర్ చెబుతున్నట్లు ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు లేకపోతే.. మద్దతు ధన ఉండదు.. గిట్టుబాటు ధర అసలే ఉండదు.. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరు వ్యవసాయాన్ని కాపాడుకోవాలి.. రైతులు బాగుటే.. కూలీలు.. గ్రామాలు బాగుంటాయని భట్టి చెప్పారు. వ్యవసాయం కార్పొరేట్ చేతుల్లోకి వెళితే.. రైతులు వ్యవసాయాన్ని మానుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మద్దతు ధర లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో.. ఖమ్మం మిర్చియార్డులో చూశామని భట్టి చెప్పారు. మద్దతు ధర లేకపోతే, గిట్టుబాటు ధర రాక ప్రశ్నించిన రైతులను సంకెళ్లు వేసి నడి రోడ్డుపై నడిపించిన ఘటనలు చూశామని భట్టి వివరించారు. అంతదాకా ఎందుకు మద్దతు ధరతో క్వింటాలుకు రూ. 1800 అమ్మకున్న మన రైతులే.. ప్రభుత్వం మద్దతు ధర తొలగిస్తే.. క్వింటాలకు రూ. 900కు అమ్ముకోవల్సి వచ్చింది.. ఇదే మొత్తంగా అయితే.. రైతులు పంటలు ఏ ధఱకు అమ్ముకోవాల్సి వస్తుందో ఊహించాలంటేనే భయం వేస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం మొత్తం తెలంగాణ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని ప్రధాని మోదీ దగ్గర తాకట్టు పెడుతున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ తెచ్చుకుంది.. కేసీఆర్ కోసమో, లేక.. ఆయన కుటుంబం కోసమో కాదని చెప్పారు. రైతులు రోడ్డుమీదకు వస్తే.. ఎంత పెద్ద ప్రభుత్వమైనా.. నియంతలైనా దిగిరావాల్సి వస్తుందని భట్టి విక్రమార్క చెప్పారు.

దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంథని ఎమ్మెల్యే
సీఎల్పీ టీమ్.. దాదాపు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి రైతులు కష్టాలు తెలుసుకున్నాం. మద్దతు ధర విషయంలో ఇబ్బందులు రైతులకు తెలుసు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను వ్యతిరకించాలి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో రైతులు రోజుల తరబడి.. చలికి పోరాటం చేస్తున్నారు. వారికి మనం సంఘీభావం పలకాలి. వ్యవసాయాన్న మొత్తం రెండుమూడు కంపెనీలకు పరిమితం చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి. తన భూమిలో రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉంది. సన్నరకాలు వేసిన ప్రతి రైతు నష్టపోయాడు.

వీ. హనుమంతరావు, మాజీ ఎంపీ
రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచనే రైతులతో ముఖాముఖీ కార్యక్రమంజ. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటే. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లు.. మూడు చట్టాలే వద్దు అంటున్న సమయంలో కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నాడని అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే మూడు చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలి.

పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
రైతులకు జరుగుతన్న నష్టాలు, కష్టాలను వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు నడ్డి విరిచేలా పాలన చేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకోమాట, పూటకోబాట.. మందులో ఉన్నప్పుడు.. ఒక మాట.. మందులో లేనప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు.

కూరపాటి కిషోర్, మండల కాంగ్రెస్ నాయకులు
బీజేపీ తీసుకువచ్చిన రైతు చట్టాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి. బీజేపీ తెచ్చిన చట్టాలు రైతులకు ఉరితాళ్లుగా మారే అవకాశం ఉంది.

భద్రారెడ్డి, రైతు
రైతాంగ సమస్యలపై ప్రతి రైతును చైతన్య పరచాల్సిన అవసరం ఉంది. రైతులను వ్యతిరేకంగా కేంద్రం, రాష్ట్రం వ్యవహరిస్తోంది. ఐకేపీ సెంటర్లు తీసేస్తే.. రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కొనుగోలు కేంద్రాలు లేకపోతే.. గిట్టుబాటు ధర ఉండదు.. ఆ ధర లేకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోతారు.

అంబటి వెంకటేశ్వర రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోరాటం చేస్తున్నారు. ఆయనకు రైతులు పూర్తిగా సహకరించాలి.

పగడాల కోటేశ్వర రావు, రైతు
కేంద్రం తెచ్చిన చట్టాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి. రైతలును ఆదుకోవాలి. ప్రతి పంటకు మద్దతు ధర కావాలి. పత్తికి, మిర్చికి మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనమంటే రైతు దిగులుతో చనిపోయే పరిస్థితులు ఉన్నాయి.

Related posts

ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు… చేపల కోసం ఎగబడుతున్న జనాలు!

Drukpadam

తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం… ఘాట్ రోడ్లపై విరిగిపడిన కొండచరియలు!

Drukpadam

పదవి విరమణ తర్వాతనే తనకు స్వాతంత్యం వెంకయ్యనాయుడు ఆసక్తి వ్యాఖ్యలు ..

Drukpadam

Leave a Comment