మంగమ్మ శపదాలకు భయపడం పొంగులేటి వ్యాఖ్యలపై …మంత్రి అజయ్ ఫైర్…
-కేసీఆర్ ఇలాంటి శపధాలు ఎన్నో చూశారు …
-కేసీఆర్ నాయకత్వంలో జిల్లాలో 10 సీట్లు గెలుస్తాం …
-చీమలపాడు మృతులకు త్వరలోనే రూ.10లక్షలు అందజేస్తాం
ఖమ్మం: దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలను గడప గడపకు తీసుకెళ్లే బాధ్యత బీఆరెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని పాపిరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఖమ్మం కార్పొరేషన్ లోని ఖానాపూర్ హవేలి డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 60 లక్షల సభ్యత్వం ఉన్న అతి పెద్ద పార్టీ బి. ఆర్.ఎస్ . అని, రాష్ట్రంలో గానీ కర్ణాటక, మహారాష్ట్ర లో మనను ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు. ఖమ్మంలో ఒకాయన మన పార్టీని భూ స్థాపితం చేస్తామని మంగమ్మ శపదాలు చేస్తున్నారని, అలాంటి శపధాలు చాలా చూశామని, కేసీఆర్ ముందు ఇలాంటి అనేక మంగమ్మ శపధాలు భూస్థాపితం అయ్యాయని అన్నారు. అసెంబ్లీ గేట్ ను తాకనివ్వను అని శపధాలు చేస్తున్న వారికి చెప్తున్న నీ శపధాలు బూడిదలో పోసిన పన్నీరులా మారుతుందన్నారు. ప్రజలు కదా నన్ను అసెంబ్లీకి పంపేది.. ఈ అభివృద్ధిని చూసి కదా ప్రజలు మనలను అసెంబ్లీ కి పంపేది.. మనకేదో కడుపు నొప్పి కలిగిందని బి. ఆర్.ఎస్ . పై విమర్శలు చేయడం సరైనది కాదన్నారు. నువ్వు అసెంబ్లీ కి పంపేది ఎంటి… ఆ అధికారం ప్రజలకు కదా ఉంది.. నగరంలో 4వేల మందికి ఉన్న చోటే ఇళ్ళకు జి. ఓ. నెంబర్ 58, 59 ద్వారా ఇళ్ళకు శాశ్వత పట్టాల మంజూరు, సీఎం సహాయ నిధి ద్వారా రూ.20 కోట్లు, 30 వేల మంది కి పెన్షన్లు, 30 వేల మంది తల్లులకు కేసీఆర్ కీట్స్, 8 వేల మందికి కళ్యాణ లక్ష్మి, షాదిముభారక్ ద్వారా 76 కోట్లు పంపిణీ, దసరాకు బతుకమ్మ చీరలు, రంజాన్ కు తోఫా లు, క్రిస్మస్ కు కానుకలు ఇలా అనేక సంక్షేమ పథకాలు అందుకుని, మన అభివృద్ధిని చూసిన ప్రజలే మనలను అసెంబ్లీ కి పంపిస్తానని తెలుసుకోవాలన్నారు. మాయ మాటలతో తెలంగాణను ఆగం పట్టియ్యాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
మొన్న చీమలపాడు లో జరిగిన ఘటన అత్యంత భాదాకరమన్నరు. వారి కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. వారికి ప్రకటించిన రూ.10 లక్షలు అతి త్వరలోనే వారి కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. మేయర్ నీరజ, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
సేమియా కిట్స్..: ఖమ్మం నగరంలోని 42వ డివిజన్ నిజాంపేట, 40వ డివిజన్ శుక్రవారపేట, 39వ డివిజన్ మెదరి బాజర్, 38వ డివిజన్ ఖిల్లా, 37వ డివిజన్ కస్బా బజార్ మాజిద్ లలో ఆయా తొఫా లను మంత్రి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ… ప్రతి ఏడాది 5 వేలు పంపిణీ చేస్తుండగా, కానీ ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి ఈసారి మరో 1700 వందల గిఫ్ట్ ప్యాక్స్ ను తెచ్చుకుని మొత్తం 6,700 కిట్స్ ను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు పువ్వాడ ఫౌండేషన్ తరుపున 6,700 సేమియా కిట్స్ ను కూడా పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ రంజాన్ గిఫ్ట్ ప్యాక్ లో చీర, బ్లౌజ్, పంజాబి డ్రెస్ మెటీరియల్, లాల్చీ, పైజమా క్లాత్ ఉంటుందన్నారు.
చీమలపాడు క్షత గాత్రుడుకి పరామర్శ: కారేపల్లి మండలం చీమలపాడు అగ్ని ప్రమాద ఘటనలో క్షతగాత్రుడై కాలు కోల్పోయి ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేడ్ కానిస్టేబుల్ దావా నవీన్ ను మంత్రి అజయ్ కుమార్ పరామర్శించారు.ఏమి అధైర్య పడొద్దని, వారికి ధైర్యం కల్పించారు. పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు అందిస్తామని, దైర్యం కోల్పోవొద్దు దైర్యం చెప్పారు. ఇప్పటికే శాఖ మంత్రి, పోలీస్ కమిషనర్ తో మాట్లాడామని ప్రభుత్వం తరుపున పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి వైద్య సేవలైన తక్షణమే అందించాలని, పూర్తిగా కోలుకునేవరకు మెరుగైన చికిత్సలను అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు.
175 పట్టాలు పంపిణీ: పేదల కష్టాలు ఎరిగిన వాడే నిజమైన నాయకుడు అని, కనీసం గుడు లేని పేదలు గుడిసెలు వేసుకున్న వారికి శాశ్వత భద్రత కల్పించేందుకు జీవో 58 కింద ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన సీఎం కేసీఆర్ పేదల ఆపద్బాంధవుడు అని మంత్రి పువ్వాడ అన్నారు. ఖమ్మం నగరంలోని 55వ డివిజన్ వేణు గోపాల్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4, 5, 6, 55, 56వ డివిజన్లలో జి ఓ 58 & 59 కింద పేదలు ధరఖాస్తు చేసుకుని మంజూరైన 175 పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూధన్, మేయర్ నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్లు దండా జ్యోతి రెడ్డి, నాగండ్ల కోటి, మోతారపు శ్రావణి సుధాకర్, పైడిపల్లి రోహిణి సత్యనారాయణ, ఆర్. డి. ఓ. రవీంద్రనాథ్, తహసిల్దార్ శైలజ పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందు లో… : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని 40వ డివిజన్ శుక్రవారపేటలోని మజీద్- ఏ ఇస్టాబల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి అజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపవాసం ఆచరిస్తున్న ముస్లిం సోదరులకు ఖజ్జూరాలు, పండ్లు తినిపించి దీక్షను విరమింపజేశారు. అనంతరం వారితో పాటు మంత్రి నమాజును ఆచరించి, దువా చేశారు. ఇఫ్తార్ లో మెహబూబ్ అలీ, తాజ్ ఉద్దీన్, షంశుద్దిన్, సలీం, టీపు, సతీష్, అసిఫ్, సాద్, జాని, అలిం, అబ్బాస్ అలీ, తాజ్ఉద్దీన్, ఆశ్రిఫ్ ఉన్నారు.