Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో 5వ స్థానంలో ఏపీ…

రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో 5వ స్థానంలో ఏపీ…
  • ఏపీలో కరోనా తీవ్రం
  • 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు
  • 8 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందన్న కేంద్రం
  • 11 రాష్ట్రాల్లో లక్షకు పైన యాక్టివ్ కేసులు
  • 10 రాష్ట్రాల నుంచే 85 శాతం కేసులు

ఏపీలో గత కొన్ని వారాలుగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్ లో కరోనా వ్యాప్తిపై తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు పంచుకుంది. దేశంలో 8 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య ఎక్కువవుతోందని పేర్కొంది. ఈ 8 రాష్ట్రాల జాబితాలో ఏపీ 5వ స్థానంలో ఉంది.

అంతేగాకుండా, 11 రాష్ట్రాల్లో 1 లక్షకు పైన యాక్టివ్ కేసులు ఉన్నాయని, దేశం మొత్తం మీద 10 రాష్ట్రాల నుంచి 85 శాతం కరోనా కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. 24 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతం దాటిందని తెలిపింది.

అటు, జాతీయ రికవరీ రేటు పెరిగిందని, ప్రస్తుతం దేశంలో కరోనా రోగులు కోలుకుంటున్న శాతం 83.83గా ఉందని వెల్లడించింది. ఓవరాల్ గా చూస్తే క్రియాశీలక కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టే భావించాలని, నమోదైన మొత్తం కేసుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి శాతం 15.07 మాత్రమేనని పేర్కొంది.

Related posts

మంచినీళ్లు తాగుతున్నా రక్తమే కనిపిస్తోంది: ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది..!

Drukpadam

పొంగులేటికి ఊరట.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కౌంటర్‌ ఆదేశం

Drukpadam

భాగ్యనగరంలో శోభాయమానంగా గణేష్ నిమజ్జనం ….

Drukpadam

Leave a Comment